AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: డిసెంబర్ 19 తరువాత ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. అన్నింట్లో విజయమే..!

హిందూమతంలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా సఫల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వలన జీవితంలో అంతా మంచే జరుగుతుందని ప్రజల విశ్వాసం. కష్టాలు తొలగిపోయి..

Astrology: డిసెంబర్ 19 తరువాత ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. అన్నింట్లో విజయమే..!
Zodiac Signs
Shiva Prajapati
|

Updated on: Dec 16, 2022 | 10:13 PM

Share

హిందూమతంలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా సఫల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వలన జీవితంలో అంతా మంచే జరుగుతుందని ప్రజల విశ్వాసం. కష్టాలు తొలగిపోయి.. సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని, చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తారని నమ్ముతారు. ఈ సంవత్సరం 2022 సఫల ఏకాదశి డిసెంబర్ 19న వస్తుంది. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. అయితే, చాలా సంవత్సరాల తరువాత సఫల ఏకాదశి రోజున మూడు శుభ యోగాలు ఏకకాలంలో ఏర్పడుతున్నాయని పండితులు చెబుతున్నారు. బుధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల సఫల ఏకాదశికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఈ రోజున భక్తి ప్రపత్తులతో వ్రతం, ఉపవాసం ఆచరించడం వలన అంతా శుభమే జరుగుతుందంటున్నారు. అంతేకాదు.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి సఫల ఏకాదశి తరువాత అంతా మంచి పరిణామాలే చోటు చేసుకుంటాయని, వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ నాలుగు రాశులు ఏంటి, డిసెంబర్ 19 తరువాత ఎలాంటి ఫలితాలు ఉంటాయి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ 4 రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది..

వృషభం..

సఫల ఏకాదశి నాడు కలిగే ఈ మూడు శుభ యోగాలు వృషభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ రాశి వారు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంది. కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. వీరిలోని వాక్ చాతుర్యం కారణంగా.. ఎంత పెద్ద పనిని అయినా సునాయాసంగా పూర్తి చేస్తారు. పెళ్లి చేసుకోవాలని చూస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది.

తుల రాశి..

తులారాశి వారికి డిసెంబర్ 19 తరువాత ఎంతో మేలు జరుగుతుంది. ఉద్యోగాలు, వ్యాపార సంబంధిత అంశాల్లో విజయాన్ని సాధిస్తారు. పదవి, ధనం, పలుకుబడి పెరుగుతాయి. ఆటంకాలు ఎదురవుతున్న పనులు సజావుగా పూర్తవుతాయి.

ఇవి కూడా చదవండి

ధనుస్సు..

సఫల ఏకాదశి నాడు ధనుస్సు రాశిలో మాత్రమే 3 శుభ యోగాల అద్భుతమైన కలయిక ఏర్పడుతోంది. ఈ కారణంగా.. ధనుస్సు రాశివారికి అంతా శుభమే జరుగుతుంది. పట్టిందల్లా అదృష్టమే అన్నట్లు ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని విధాలా మంచే జరుగుతుంది.

మీన రాశి..

మీనరాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయని అంటున్నారు పండితులు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. జీవితాన్నే మార్చేసే అవకాశం లభించనుంది. ఆదాయం పెరగడమే కాకుండా.. అన్ని అంశాల్లోనూ సానుకూల పరిస్థితులు ఉంటాయి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు ప్రజల సాధారణ ఆసక్తులు, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.