Funny Video: పాపం పాప.. ‘జంబలకిడి జారుమిఠాయా’ పాట పాడిందేమో.. ఆవు రియాక్షన్ మామూలుగా లేదుగా..

వీడియో షేరింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత యువతలో సోషల్ మీడియా ఫీవర్ పీక్స్‌కి చేరింది. ఈ వీడియో షేరింగ్ యాప్స్ వల్ల చాలా మంది తమలోని ట్యాలెంట్ వల్ల పాపులర్ అయ్యారు.

Funny Video: పాపం పాప.. ‘జంబలకిడి జారుమిఠాయా’ పాట పాడిందేమో.. ఆవు రియాక్షన్ మామూలుగా లేదుగా..
Funny Video
Follow us

|

Updated on: Dec 16, 2022 | 4:48 PM

వీడియో షేరింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత యువతలో సోషల్ మీడియా ఫీవర్ పీక్స్‌కి చేరింది. ఈ వీడియో షేరింగ్ యాప్స్ వల్ల చాలా మంది తమలోని ట్యాలెంట్ వల్ల పాపులర్ అయ్యారు. రకరకాల ప్రయత్నాలు, డ్యాన్స్‌లు, జోక్స్, న్యూ స్టంట్స్, న్యూ క్రియేటీవిటీతో వీడియోలు రూపొందించి సోషల్ మీడిలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎంతలా అంటే.. ఆ వీడియోను చూస్తే పడి పడి నవ్వాల్సిందే.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి ఆవు దూడ ముందు సెల్‌ఫోన్ కెమెరా పెట్టి.. దాని వెనుక నిల్చుని పాట పాడుతూ డ్యాన్స్ వేసే ప్రయత్నం చేసింది. కానీ, అమ్మడు పాట, డ్యాన్స్ ఆ లేగ దూడుకు రుచించలేదేమో.. అదిరిపోయే రియాక్షన్ ఇచ్చింది. చల్ హట్ అనే రేంజ్‌లో వెనక్కి తిరిగి పాపను కంగారెత్తించింది. ఆవు దూడ రియాక్షన్‌తో బెదిరిపోయిన అమ్మాయి.. బాబోయ్ అంటూ అక్కడి నుంచి పరుగులు తీసింది. కొంత దూరం వెళ్లి మళ్లీ వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆవు దూడ నుంచి అదే రియాక్షన్ రావడంతో అమ్మాయి బిత్తరపోయింది. ఇక కష్టం అనుకుని, ఏదోలా తన ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి ‘జంబలకిడి జారుమిఠాయా’ అంటూ జారుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘rjkisnaa’ అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ రాగా, 253K లైక్స్ వచ్చాయి. అమ్మాయి ఆవు ఇచ్చిన షాక్ చూసి.. నెటిజన్లు అంతే షాకింగ్ లెవల్‌లో కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో ఇదే..

View this post on Instagram

A post shared by Rj Kisna (@rjkisnaa)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles