Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన మంటల వెనుక మిస్టరీ.. అదే నిజమా?

గుడిపల్లి సజీవదహనం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. ఆరుగురిని ముందుగానే హత్యచేసి, పెట్రోల్‌పోసి తగులబెట్టారా..? వివాహేతర సంబంధమే ఘటనకు కారణమా..? రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో..

Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన మంటల వెనుక మిస్టరీ.. అదే నిజమా?
Fire Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 17, 2022 | 9:33 PM

గుడిపల్లి సజీవదహనం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. ఆరుగురిని ముందుగానే హత్యచేసి, పెట్రోల్‌పోసి తగులబెట్టారా..? వివాహేతర సంబంధమే ఘటనకు కారణమా..? రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో అసలేం జరిగింది..? మంచిర్యాలజిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో జరిగిన సజీవదహన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు సజీవదహనమయ్యారు. మృతులు శివయ్య, పద్మ, మౌనిక, హిమబిందు, స్వీటితోపాటు శనిగారపు శాంతయ్య ఉన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, 16 బృందాలను రంగంలోకి దింపారు. వివాహేతర సంబంధం కోణంలోనే విచారణ చేపట్టారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పు అంటుకొని మృతిచెందిన ఘటనలో ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు ఉన్నాయి. బొగ్గు గనిలో పనిచేసే శనిగారపు శాంతయ్య, గత కొన్నేళ్లుగా మాసు శివయ్య ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి ఇంటి యజమాని భార్య పద్మకు వివాహేతర సంబంధం ఉందని సమాచారం. సజీవ దహనమైన ఇంటి చుట్టుపక్కల నాలుగు పెట్రోల్ క్యాన్లు,ఆటోలో మిరప్పొడి ఉండడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు. ఇంటికి బయటి నుంచి గడియపెట్టినట్టు తేల్చారు పోలీసులు.

శనిగారపు శాంతయ్య సొంతూరు లక్షేట్టి పేట దగ్గర ఊట్కూర్. అన్నదమ్ముల పొత్తుల రెండున్నర ఎకరాల భూమి ఉండగా 50 రోజుల క్రితం భూమిని అమ్మకానికి పెట్టి 30 లక్షల అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. ఈ డబ్బుల విషయంలో కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని సన్నిహిత కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక..పద్మ కుమారుడి ఇంట్లో పురుడుకోసం రెండ్రోజుల కిందట ఎమ్మెల్యే కాలనీకి చుట్టపుచూపుగా వచ్చి ప్రాణాలు కోల్పోయింది. పిల్లలు మాంసపు ముద్దగా మారిపోయిన దృశ్యం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

శివయ్య ఇంటిలోనే ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం..

చనిపోయిన మాసు శివయ్య ఇంటిలోనే ఆరు మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. క్లూస్‌ టీమ్‌ శాంపిల్స్‌ సేకరించి, ల్యాబ్‌కు పంపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఒకేచోట ఆరుగురికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు మృతదేహాలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు నిరాకరించడంతో అక్కడే పోస్టుమార్టం చేశారు. ఈ ఘటనపై పోస్టుమార్టం రిపోర్టే కీలకం కానుంది.

గుడిపల్లి గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. కేసును చేధించేందుకు జిల్లా అడిషనల్ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ప్రత్యేక చొరవ చూపారు. ఎన్నడూ లేని విధంగా స్పెషల్ పోలీస్ బెటాలియన్ దళాలను గ్రామంలోకి దింపి అడుగడుగునా జల్లెడ పడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్