US Woman: లక్ అంటే ఈ మహిళాదే.. ఆఫీసు పార్టీలో గిఫ్ట్స్ ఎక్సేంజ్ తో రూ. 1 కోటి 45 లక్షలు గెలుపు..

అయితే ఉద్యోగం చేస్తూ.. త ద్వారా ధనవంతులు కావాలని కలలు కనేవారు ఉన్నారు.. అయితే ఇలాంటి కల నెరవేరడం అందరికీ సాధ్యం కాదు. కానీ అదృష్టం కొందరికి అనుకూలంగా ఉంటుంది.. అది వారిని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్తుంది.

US Woman: లక్ అంటే ఈ మహిళాదే.. ఆఫీసు పార్టీలో గిఫ్ట్స్ ఎక్సేంజ్ తో రూ. 1 కోటి 45 లక్షలు గెలుపు..
Lori Janes
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2022 | 3:45 PM

ఎవరి అదృష్టం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఓడలు బండ్లు..బండ్లు ఓడలుగా అవ్వడం ఒక్క క్షణం చాలు అని పెద్దలు ఓ సామెతను చెబుతారు.. అంటే.. అదృష్టం తలుపు తడితే.. ఒక క్షణం పేదవాడు, మరుసటి క్షణం అతను కోటీశ్వరుడు అవుతాడు. అయితే మనిషి జీవితం అదృష్టం, దురదృష్టంతో ఆధారపడి ఉంటుందని ఒకొక్కసారి జరిగిన సంఘటనలు ఆధారంగా నిర్ణయిస్తారు. ఒకరి జీవితం ఒకొక్కసారి ఒకొక్క మలుపు తీసుకుంటుంది. అతను క్షణంలో ధనవంతుడు అవుతాడు. అయితే ఉద్యోగం చేస్తూ.. త ద్వారా ధనవంతులు కావాలని కలలు కనేవారు ఉన్నారు.. అయితే ఇలాంటి కల నెరవేరడం అందరికీ సాధ్యం కాదు. కానీ అదృష్టం కొందరికి అనుకూలంగా ఉంటుంది.. అది వారిని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్తుంది. అలా అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తిన ఓ మహిళ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని వెనుక కథ చాలా ఫన్నీగా ఉంది.

అమెరికాలోని కెంటకీలో నివసిస్తున్న ఓ మహిళకు 1,75,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 1 కోటి 45 లక్షల రూపాయల లాటరీ తగిలింది. విశేషమేమిటంటే.. ఆ యువతికి ఈ బహుమతి తాను పనిచేస్తున్న ఆఫీసులో తగిలింది. ఆ మహిళ పేరు లోరీ జేన్స్.  ఆమె లూయిస్‌విల్లేలోని హార్మన్ డెంటల్ సెంటర్‌లో ఆఫీస్ మేనేజర్‌గా ..  ట్రీట్‌మెంట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.

లక్షాధికారిని చేసిన హాలిడే పార్టీ బహుమతి న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. లోరీ ఆఫీసు ఒక హాలిడే పార్టీని నిర్వహించింది. ఈ పార్టీలో ఉద్యోగులందరికీ కొంత బహుమతి ఇచ్చారు. అప్పుడు లోరీకి 25 డాలర్లు అంటే దాదాపు 2 వేల రూపాయల బహుమతి కూడా వచ్చింది. అయితే ఆమె తోటి ఉద్యోగి ఒకరు ఆమెను ఆ బహుమతిని ఇవ్వమని అడిగారు. దీంతో లోరీ ఆ బహుమతిని కొలీగ్ కు ఇచ్చి.. తన కోసం మరొక బహుమతిని ఎంచుకుంది.  ఇప్పుడు బహుమతి తీసుకోకుండా.. లాటరీ టిక్కెట్లను డబ్బులకు బదులుగా లోరీ తీసుకుంది. తర్వాత ఆ లాటరీ టిక్కెట్లను గీసి చూడగా.. షాక్ తగిలింది లోరీకి.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం.. తోటి ఉద్యోగుల కోరిక మేరకు..  లోరీ టిక్కెట్‌ను గీసి చూసింది. దీంతో ఆమె ఆనందానికి చోటు లేదు. మొదటి టికెట్‌పై ఆమె 50 డాలర్లు అంటే సుమారు 4 వేల రూపాయలు గెలుచుకున్నది. ఆ తర్వాత ఆమెకు జాక్‌పాట్ తగిలింది. $175,000 అంటే దాదాపు రూ. 1 కోటి 45 లక్షల లాటరీని గెలుచుకుంది. ఈ విధంగా.. లోరీని ఆఫీసు ఒక్క క్షణంలో కోటీశ్వరురాలిని చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..