AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Covid: చైనాలో మళ్లీ కోరలు చాస్తోన్నా కరోనా వైరస్‌.. నిర్మానుష్యంగా చైనా నగరాలు! అబ్బే అదేంలేదంటున్న..

ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేసిస కోవిడ్‌ ఉధృతి ఇంకా శాంతించినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా కోవిడ్‌ పుట్టిల్లు చైనాలో నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది. చైనాలో కొవిడ్‌ ఆంక్షలు సడలించినప్పటికీ..

China Covid: చైనాలో మళ్లీ కోరలు చాస్తోన్నా కరోనా వైరస్‌.. నిర్మానుష్యంగా చైనా నగరాలు! అబ్బే అదేంలేదంటున్న..
China Covid Surge
Srilakshmi C
|

Updated on: Dec 19, 2022 | 6:59 AM

Share

ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేసిస కోవిడ్‌ ఉధృతి ఇంకా శాంతించినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా కోవిడ్‌ పుట్టిల్లు చైనాలో నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది. చైనాలో కొవిడ్‌ ఆంక్షలు సడలించినప్పటికీ, వైరస్‌ ధాటికి అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఆదివారం (డిసెంబర్‌ 18) నాడు చైనాలోని ఉత్తర, దక్షిణ భాగాల్లోని ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

చైనాలో కోవిడ్‌ కేసుల సంఖ్య, మరణాల గురించిన వార్తలేవీ డిసెంబర్‌ 7 నుంచి బయటికి రాకపోవడంతో నిన్నటి సంఘటన అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. పైగా శ్మశాన వాటికల వద్ద పెరుగుతున్న రద్దీ… దృష్ట్యా అక్కడి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా గత మూడేళ్లుగా జీరో కోవిడ్‌ వ్యూహంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసినప్పటికీ.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు లేకపోవడం, ఐసోలేషన్‌ నిబంధనలు, ప్రయాణాల ట్రాకింగ్‌పై ఉన్న ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. దీంతో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే చాలా నగరాలు నిర్మానుష్యంగా మారినట్లు తెలుస్తోంది.

చైనా చీఫ్ ఎపిడెమియాలజిస్ట్వూ జూన్‌యూ అంచనాల ప్రకారం.. ఈ వింటర్‌ సీజన్‌లో కోవిడ్‌-19 కేసులు అత్యధికంగా ఉన్న మొదటి మూడు దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఇక వచ్చే నెల (జనవరి)లో కొత్త ఏడాది సంబరాలకు మరింత మంది తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉన్నందున కోవిడ్‌ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో కరోనా తొలి వేవ్‌ నడుస్తోంది. దీనిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రచారం మరోలా ఉంది. అక్కడ కోవిడ్‌ ఆంక్షలు (జీరో కోవిడ్‌) ఎత్తివేసినప్పటి నుంచి ఒక్క కోవిడ్‌ మరణం కూడా సంభవించలేదని ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు. అది వాస్తవమైతే… బీజింగ్‌, చెంగ్డూ వంటి సిటీల్లోని శ్మశాన వాటికలు మాత్రం ఎందుకు బిజీగా ఉన్నాయనే వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇదంతా చూస్తుంటే అక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయని పలువురు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.