Shahrukh Khan: షారుఖ్‌ ఖాన్‌ పాటకు డ్యాన్స్‌ చేసినందుకు ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

చేతుల్లో కత్తులు పట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్న ఐదుగురు యువకులను ఇండోర్ పోలీసులు శనివారం (డిసెంబర్‌ 17)న అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ సంఘటన..

Shahrukh Khan: షారుఖ్‌ ఖాన్‌ పాటకు డ్యాన్స్‌ చేసినందుకు ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
Shahrukh Khan
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 18, 2022 | 12:43 PM

చేతుల్లో కత్తులు పట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్న ఐదుగురు యువకులను ఇండోర్ పోలీసులు శనివారం (డిసెంబర్‌ 17)న అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ ఖాన్ మువీ ‘త్రిమూర్తి’లోని ‘బోల్ బోలే బోల్ తుజ్కో క్యా చాహియే’ పాటకు యువకులు డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. సుమారు ఒకటిన్నర అడుగుల పొడవున్న కత్తులను పట్టుకుని ఐదుగురు వ్యక్తులు డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియో చూసిన పోలీసులు ఆయుధాల చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

శుక్రవారం (డిసెంబర్‌ 16) నాడు బర్త్‌డే పార్టీ జరుపుకుంటున్న ఐదుగురు యువకులు కత్తులతో డ్యాన్స్‌ చేసిన వీడియో పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు ఆయుధాల చట్టంలోని సెక్షన్‌ 25 కింద వారిని అరెస్ట్‌ చేసినట్లు తేజాజీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ రామ్‌దీన్‌ కన్వా మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!