కారు కీని పోగొట్టుకున్నారా? స్పేర్ కీస్ ఎలా పొందాలంటే..
TV9 Telugu
25 December 2024
కొన్ని సార్లు కార్ కీస్ మనకు తెలియకుండానే పోగొట్టుకుంటాం. అయితే స్పైర్ కీ ఉంటుంది. అది కూడా లేకపోతే ఏమి చెయ్యాలి.?
దగ్గరల్లోని డూప్లికేట్ తాళాలు చేసేవారి దగ్గరకు వెళ్లకండి. ఇవి మీ కార్ లాక్ సిస్టమ్‌ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. వెంటనే మీరు రీప్లేస్‌మెంట్‌కు వెళ్లాలి.
మార్కెట్లో ట్రెడిషనల్ కీస్, ట్రాన్స్‌పాండర్ కీస్, స్మార్ట్ కీస్ లాంటి పలు ఆప్షన్స్ ఉంటాయి. మీ డీలర్‌కు చెప్పి అనువైంది ఎంచుకోండి .
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. దీని వల్ల కారు దొంగతనానికి గురికాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పరిహారం పొందడానికి వీలవుతుంది.
మీ కార్ డీలర్‌కు అన్ని పత్రాలు సమర్పిస్తే వాళ్లు మీకు స్పేర్ కీస్‌గానీ, డూప్లికేట్ కీస్‌గానీ ఇస్తారు. మీ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా విషయం తెలియజేయాలి.
ఇలా కనుక చేయకపోతే, బీమా కంపెనీకి మీ కార్ కీస్ పోయాయని తెలియదు కనుక, ఒకవేళ మీ కారును ఎవరైనా దొంగతనం చేసినా పరిహారం అందించదు.
ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా రోడ్ సైడ్ అసిస్టెన్స్, కీ రీప్లేస్‌మెంట్ లాంటి యాడ్-ఆన్‌లను చేర్చుకోవాలి. కారు కీ పోతే ఇన్సూరెన్స్ పరిహారం అందిస్తుంది.
మీరు మీ ఇంటి నుంచి చాలా దూరంలో ఉన్నారు. మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ రైడర్ ఉంటే ఇన్సూరెన్స్ వాళ్లే మీ ఇంటి నుంచి స్పేర్ కీస్ తీసుకుని వచ్చి మీకు ఇస్తారు.