Health Tips: భోజనం తర్వాత నడవడం ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో తెలుసా..? తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే..

ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండడానికి పండ్లు, కూరగాయలు, నీరు సరైనా మోతాదులో తీసుకోవాలి. అలాగే హోం మేడ్ జ్యూస్ కూడా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం కూడా మన జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. వేయించిన ఫుడ్స్, అయిలీ ఫుడ్స్ తినడం

Health Tips: భోజనం తర్వాత నడవడం ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో తెలుసా..? తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే..
Walking After Dinner
Follow us

|

Updated on: Dec 18, 2022 | 1:30 PM

ప్రస్తుతం మానవుడు అవలంభిస్తున్న జీవన విధానం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో అతను సతమతమవుతున్నాడు. వీటికి తోడు చెడు ఆహారపు అలవాట్లు కూడా తోడు అవడంతో ఆరోగ్య సమస్యలు మరింతగా పెరిగాయి. సాధారణంగా మన శరీరానికి కావలసిన పోషకాలు ఆహారం నుంచి మాత్రమే అందుతాయి. అలాగే తీసుకునే ఆహారం కారణంగానే శరీరంలో అనేక సమస్యలు, వ్యాధులు వస్తాయి. అందుకు కారణం మన తీసుకున్న ఆహారంలో పోషకాలు లేకపోవడం, లేదా అది జంక్ ఫుడ్ అయి ఉండడమే. ఇదీ కాకపోతే మన జీర్ణవ్యవస్థలోని సమస్యలు. మరి అలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండడానికి పండ్లు, కూరగాయలు, నీరు సరైనా మోతాదులో తీసుకోవాలి. అలాగే హోం మేడ్ జ్యూస్ కూడా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం కూడా మన జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. వేయించిన ఫుడ్స్, అయిలీ ఫుడ్స్ తినడం జీర్ణవ్యవస్థకు అంత మంచిది కాదు. అంతేకాక ఎలాంటి ఆహారం తీసుకున్నా.. తిన్న తర్వాత కనీసం 15 నిముషాల పాటు తప్పని సరిగా నడవాలి. అలా నడవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తద్వారా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉండదు. దీనికి తోడు నిత్యం వ్యాయామం చేయడం ఉత్తమం. తిన్న తర్వాత నడవడం వల్ల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

దానితో పాటు మధుమేహం, మలబద్ధకం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నిత్యం మందులు వాడినా కొన్ని సమస్యలకు ఫలితం ఉండదు.  కానీ ఈ వ్యాధులన్నీ స్వయంగా నియంత్రించుకోవచ్చు. అందుకోసం నిత్యం భోజనం తర్వాత నడవాలి. ఇంకా తీసుకునే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అయితే తిన్న వెంటనే పరిగెత్తడం కూడా సరికాదు. తిన్న తర్వాత పరిగెత్తడం వల్ల అజీర్ణం, విరేచనాలు, వికారం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తిన్న తర్వాత 10 నిమిషాలు నడవండి. ఇలా రెగ్యులర్‌గా నడిస్తే జీర్ణ సమస్యలు మీ దరి చేరవు. జీర్ణక్రియ సక్రమంగా ఉంటే, దాని నుండి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

తిన్న తర్వాత వాకింగ్‌కు వెళ్లేటప్పుడు అతి వేగంగా నడవకూడదు. నెమ్మదిగా నడవండి. అప్పుడు మీరు వేగాన్ని నిదానంగా పెంచవచ్చు. గట్టిగా ఊపిరి పీల్చుకోండి. తిన్న తర్వాత నడిచే అలవాటును ఈరోజే ప్రారంభించండి. మొదటి రోజు చాలా ఎక్కువగా నడవకండి. మొదటి రోజే ఎక్కువగా నడవడం వల్ల శరీరంలో ఇబ్బందిగా ఉండవచ్చు. మీ శరీరం చేయగలిగినంత చేయండి. అతిగా నడవడం వల్ల గ్యాస్, అజీర్ణం ఏర్పడుతుంది. అందువల్ల తగిన జాగ్రత్తలు పాటించి నడవడాన్ని ప్రారంభించండి.

ఇవి కూడా చదవండి
Latest Articles