Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఈ పదార్థాలను అస్సలు ముట్టుకోకండి..

కాలేయానికి (Fatty Liver) సంబంధించిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సరైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి వంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ రోగుల సంఖ్య

Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఈ పదార్థాలను అస్సలు ముట్టుకోకండి..
Fatty Liver
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 18, 2022 | 8:20 AM

Fatty Liver consumption: కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ కాలేయ ఈ వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా లివర్‌కు సంబంధించిన ప్రమాదాలను తగిన సమయంలో నివారించవచ్చు. అయితే.. కాలేయానికి (Fatty Liver) సంబంధించిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సరైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి వంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ రోగుల సంఖ్య ( Patients) పెరుగుతోందంటున్నారు నిపుణులు. అయితే.. ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఆల్కాహాలిక్, రెండు నాన్ ఆల్కాహాలిక్.

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది.అయితే కొన్నేళ్లుగా తక్కువ లేదా ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ మద్యం తాగకపోయినా.. ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తుంటే.. ఈ రుగ్మతను నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు. కొవ్వు కాలేయం చుట్టూ చేరడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ సాధారణ కాలేయ వ్యాధి 5-20 శాతం భారతీయులను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాల్షియం, ప్రొటీన్, విటమిన్-ఎ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్న పాలు ఆరోగ్యానికి అవసరమైన ఆహారంలో ఒకటి.

పాల పదార్థాలు..

అయితే.. ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న రోగులకు పాలు స్లో పాయిజన్‌లా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఫ్యాటీ లివర్ పేషెంట్లకు ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి. వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం.. ఈ వ్యాధితో బాధపడేవారికి పాలు తాగడం కూడా హానికరం. దీనితో బాధపడే రోగులు.. పాలు తాగకూడదని ఎందుకు సూచిస్తున్నారో తెలుసుకుందాం.

ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే రోగులు.. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కావున పాలకు దూరంగా ఉండాలంటున్నారు. దీనితో పాటు, పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల శరీర వాపు, కొవ్వు బాగా పెరుగుతుంది. పాలలోని క్రీమ్ జిడ్డులాంటి కొవ్వు పదార్థాలను కలిగిఉంటుంది. ఈ కొవ్వు కాలేయం చుట్టూ చేరుతుంది. అందుకే ఈ సమస్యతో బాధపడే వారు పాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదేకాకుండా, కార్బోహైడ్రేట్ ఆహారాలు (వైట్ రైస్, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్) తినడం మానుకోవాలి.

ఫ్యాటీ లివర్ నివారణ : మీరు ఫ్యాటీ లివర్ నివారించాలనుకుంటే.. మీ ఆహారంలో కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలను చేర్చుకోవాలి. ఇది కాకుండా, తాజా పండ్లు, కూరగాయలు తినండి. మోనోశాచురేటెడ్ కొవ్వులు, వెయ్ ప్రోటీన్, గ్రీన్ టీ వంటి ఆహారాలను కూడా ఆహారంలో చేర్చుకోండి. ఆకు కూరలు, వాల్‌నట్‌లు, ఆలివ్ నూనె, వెల్లుల్లి, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, బెర్రీలు, ద్రాక్షలను తీసుకోవడం కాలేయానికి చాలా మంచిది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కాలేయ వ్యాధితో బాధపడేవారు మద్యం సేవించకూడదు.

Also Read:

Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? కలబందను ఇలా ఐదు పద్దతుల్లో తీసుకోండి..

Blood Pressure: మీకు బీపీ ఉందా…? చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!