Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SteviaLeaves : షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం.. పంచదార బదులు ఈ ఆకులు..!(వీడియో)

SteviaLeaves : షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం.. పంచదార బదులు ఈ ఆకులు..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 18, 2022 | 10:24 PM

Stevia Leaves-Ayurveda: ఎవరికైనా నువ్వు ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యానికి మంచిది వైద్యులు చెబుతారు. అప్పుడు వాటినే ఇంకా తినాలనే కోరిక కలుగుతుంది. ఎందుకంటే మనిషి జిహ్వ చాపల్యం అలాంటిది మరి. ముఖ్యంగా షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు ఈ కోవలోకే వస్తారు.



Stevia Leaves-Ayurveda: ఎవరికైనా నువ్వు ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యానికి మంచిది వైద్యులు చెబుతారు. అప్పుడు వాటినే ఇంకా తినాలనే కోరిక కలుగుతుంది. ఎందుకంటే మనిషి జిహ్వ చాపల్యం అలాంటిది మరి. ముఖ్యంగా షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు ఈ కోవలోకే వస్తారు. రోజు రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా అధికంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఉన్నరని పలు అధ్యయనాలు చెబుతున్నారు. ప్రతి పదిమందిలో ఏడుగురు షుగర్ వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. దీనికి కారణం రక్తంలోని షుగర్ లెవెల్స్ లో ఏర్పడే హెచ్చుతగ్గులే. అందుకనే షుగర్ వ్యాధి సోకినవారు తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయితే మధుమేహులకు తీపి పదార్ధాలను తినాలని.. టీలో షుగర్ వేసుకుని తాగాలని కోరుకుంటారు. అటువంటి వారికోసమే.. పంచదార బదులు ఈ మొక్కల ఆకులను ఉపయోగించండి.. ఔషధ గుణాలున్న మొక్కల్లో ఒకటి స్టివియా. వివరాల్లోకి వెళ్తే..

మధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. స్టివియా మొక్క ఆకుల్లో పంచదార కంటే ఎక్కువ తియ్యదనం ఉంది. ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క మధుమేయాన్ని నియంత్రణలో ఉంచుతుంది.  స్టీవియా మొక్క ఆకులు చాలా తియ్యగా ఉంటాయి కనుక.. ఈ మొక్కను మధుపత్రి, తియ్యని మొక్కఅని కూడా పిలుస్తుంటారు.స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్‌లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కల్గివుంటాయి. వీటినుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార స్టీవియా ఆకుల నుంచి తీసిన పంచదార ఒక స్పూనుతో సమానం. కనుక మధుమేహ వ్యాధి ఉన్నవారు సహజమైన రుచికరమైన ఈ ఆకుల పొడిని వాడుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

Published on: Jan 18, 2022 09:51 PM