Raisins with Milk: ఈ పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా.. రోజూ ఇలాగే తాగుతారు..!(వీడియో)
కరోనా వైరస్ కల్లోలం తర్వాత ప్రజల ఆహార అలవాట్లలో కొంత మార్పు వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో రోజు తినే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ని కూడా చేర్చుకున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి.
కరోనా వైరస్ కల్లోలం తర్వాత ప్రజల ఆహార అలవాట్లలో కొంత మార్పు వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో రోజు తినే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ని కూడా చేర్చుకున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా ఎండు ద్రాక్ష మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ద్రాక్షలో ఎన్ని మంచి పోషక విలువలు ఉన్నాయో.. అంతే స్థాయిలో ఎండు ద్రాక్షలో కూడా ఉన్నాయి. అనేక వ్యాధులను నయం చేసేందుకు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ముఖ్యంగా రోజూ రాత్రి పూట కిస్మిస్‌తో కలిపిన పాలు తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఒక గ్లాస్ పాలు తీసుకుని దానిలో ఏడు కిస్మిస్‌లను కొంచెం బెల్లం వేసుకుని మరిగించి రోజూ రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. ఈ కిస్మిస్ పాలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..మలబద్దకంతో బాధపడేవారికి ఇది చాలాబాగా పని చేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఓగ్లాసు కిస్మిస్‌తో చేసిన పాలు తాగితే మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, ఈ పాలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి. రేచీకటి, గ్లకోమా, శుక్లాలు వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తాయి. ఈ పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఈ పాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మందివి. కొలెస్ట్రాల్, బీపీలు నియంత్రణలో ఉంటాయి. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. అలసటగా, నీరసంగా ఉన్నవారు కిస్మిస్ పాలను తాగితే ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. చురుగ్గా పనిచేస్తారు. రక్తహీనత ఉన్నవారికి ఈ కిస్మిస్ పాలు మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఈ పాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపునిస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
*పురుషుల్లో అయితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, వీర్య వృద్ధి చేస్తుంది.