Hyderabad PUBs: మద్యం మత్తులో ఆకతాయిల వేధింపులు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి..!(వీడియో)
హైదరాబాద్‌లోని పబ్బుల దగ్గర గబ్బు చేష్టలు ఎక్కువవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని రోగ్ పబ్ దగ్గర... కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. వ్యాలెట్ పార్కింగ్ చేసుకున్న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కార్లు ఎక్స్‌చేంజ్ చేసుకుందామంటూ ఒత్తిడిచేశారు. అయితే,
హైదరాబాద్‌లోని పబ్బుల దగ్గర గబ్బు చేష్టలు ఎక్కువవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని రోగ్ పబ్ దగ్గర… కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. వ్యాలెట్ పార్కింగ్ చేసుకున్న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కార్లు ఎక్స్‌చేంజ్ చేసుకుందామంటూ ఒత్తిడిచేశారు. అయితే, ఎందుకు చేసుకోవాలంటూ నిలదీసిన యువతి.. తన కారు రాగానే వెళ్లిపోయింది. ఈ ఘటనపై జూబ్లిహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది యువతి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.సిటీలోని పబ్బుల దగ్గర ఇలాంటి చేష్టలు సర్వసాధారమవుతున్నాయి. పార్టీల పేరుతో ఫుల్లుగా మద్యం సేవించి.. రచ్చరచ్చ చేస్తున్నారు కొందరు. తాజాగా యువతిని వేధించిన యువకులు కూడా.. మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, కార్లు ఎక్స్‌చేంజ్ చేసుకునేందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో… తీవ్రంగా దూషించినట్టు తెలుస్తోంది. తనను ఎందుకు తిడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి … పోలీసులకు కంప్లయింట్ చేసింది. సీసీ పుటేజీ ఆధారంగా వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.
స్పాట్..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

