AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure: మీకు బీపీ ఉందా…? చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Blood Pressure: ఇప్పుడున్న జీవనశైలిలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తినే ఆహారం, జీవన విధానాలు మన ఆరోగ్యంపై..

Blood Pressure: మీకు బీపీ ఉందా...? చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
Subhash Goud
|

Updated on: Jan 18, 2022 | 7:33 AM

Share

Blood Pressure: ఇప్పుడున్న జీవనశైలిలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తినే ఆహారం, జీవన విధానాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఎండాకాలం, చలికాలం, వర్షాకాలాలో కూడా రకరకాల వైరస్‌లు వెంటాడి ఆనారోగ్యం బారిన పడుతుంటాము. ఇక చలికాలంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చలివల్ల అరోగ్యం దెబ్బతినడమే కాకుండా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక బీపీ ఉన్నవాళ్లు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బీపీ ఉన్న వాళ్లకి ఈ కాలంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు. చల్లటి వాతావరణం వలన శరీరంలో రక్త సరఫరా జరగడానికి అధిక శక్తి కావాల్సి వస్తుందట. ఈ కారణంగా బీపీ ఆటోమేటిక్ గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బీపీ మరీ ఎక్కువగా పెరిగితే వచ్చే ఆరోగ్య సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీపీ ఉన్నవాళ్లు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. ప్రతి రోజు వాకింగ్‌ చేయాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం అదుపులో ఉంటుంది.

దుస్తుల విషయంలో జాగ్రత్తలు:

మన దుస్తుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చలిని తట్టుకునే మందపాటి దుస్తులను ధరించడం మేలు. దీని వల్ల శరీరం సాధారణ ఉష్ణోగ్రతను కలిగి యధావిధిగా ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుందంటున్నారు. వెచ్చగా ఉండటంతో పాటుగా ఊపిరి తీసుకోవడంలో తేలికగా ఉండి గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. చలి కాలంలో ఉదయం లేవగానే జాగ్రత్తలు తీసుకోవాలి. చలి ఎక్కువ ఉండి జాగ్రత్తలు పాటించనట్లయితే బీపీ ఉన్నవాళ్లకు ప్రమాదమేనంటున్నారు.

చలికాలంలో ఆల్కహాల్‌కు దూరం..

బీపీ ఉన్నవాళ్లు చలికాలంలో ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది. అలాగే కేఫిన్‌ ఉన్న పానీయాలకు దూరంగానే ఉండాలి. ఇవి మన శరీర ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తాయట. బీపీ ఉన్నవాళ్లు ప్రతి రోజు వ్యాయామం చేసే ఎంతో మంచిది. అలాగే వ్యాయామం మంచిదే కానీ.. అతిక చేస్తే ప్రమాదమే. శరీరాన్ని బాగా కష్టపెట్టేలా వ్యాయమం చేస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. బీపీ ఉన్న వారు ఈ చలికాలం లో దొరికే సీజనల్ కూరగాయలను, పండ్లను తినడం ఎంతో మేలు.

ఇవి కూడా చదవండి:

Heart Problem: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..? గుండె పనితీరు మందగించి సమస్యల్లో చిక్కుకున్నట్లే..!

Salt Effect: మీలో ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే అర్థం..!