Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

మీలోని అలవాట్లు మీ ఆరోగ్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అవి చిన్న చిన్నగా కనిపించినా రాబోయే రోజుల్లో మీ హెల్త్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. తరచుగా కొన్ని అలవాట్ల వల్ల ఎముకలు

Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..
Bone Health
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 18, 2022 | 7:15 AM

మీలోని అలవాట్లు మీ ఆరోగ్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అవి చిన్న చిన్నగా కనిపించినా రాబోయే రోజుల్లో మీ హెల్త్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. మనం చేసే నిర్లక్ష్యం మన ఎముకలపై పడుతుంది. తరచుగా కొన్ని అలవాట్ల వల్ల ఎముకలు బలహీనపడతాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి మనను మనం రక్షించుకోవాలంటే మాత్రం కొన్ని చిట్కాలను అలవాటు చేసుకోవాలి. అలాంటి కొన్ని అలవాట్ల గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం.

వ్యాయామం: వ్యాయామం అనేది ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా ముఖ్యం. శరీరములో శక్తి వినియోగించుకొని కేలరీలను ఖర్చు చేసే పని ఏదైనా సరే వ్యాయామమే. ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెందుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల నివారణ కు తోడ్పడుతుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం: ఆహారం రుచిని పెంచినప్పటికీ ఉప్పు సహాయ పడుతుంది. అంతే అదే ఉప్పును మనం అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీనితో పాటు  కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎముకలను మరింత బలహీనంగా చేయడానికి  ఉప్పు పని చేస్తుంది.

పోషకాహారం తీసుకోకపోవడం: చాలామంది తమ ఆహారపు అలవాట్లను వారి దినచర్యలో భాగంగా చేసుకుంటారు. ఇందులో పోషకాలు ఉండవు. ఇది ఎముకలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మారుతున్న జీవనశైలిలో ఈరోజుల్లో జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు. వాటి వల్ల కలిగే హాని తెలిసినా వాటిని తింటారు.

నిలబడి నీరు త్రాగడం: మనలో చాాలా మందికి నిలబడి నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇది సరైన అలవాటు కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా నీరు తాగేవారిలో ఎముక నొప్పి లేదా బలహీనత వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. కూర్చొని నీళ్లు తాగడమే కాకుండా తాగే నీటిని సిప్ సిప్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

విటమిన్ డి తీసుకోకపోవడం: పని ఒత్తిడి లేదా బిజీ షెడ్యూల్ కారణంగా.. ప్రజలు తరచుగా ఎండలో కూర్చోవడం మానేస్తారు. సూర్యకాంతి నుండి విటమిన్ డి ఎముకలకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కొంతమందికి గది నుండి బయటకు కూడా రాని అలవాటు ఉంటుంది. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

ధూమపానం: ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై మాత్రమే కాకుండా ఎముకలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. నివేదికల ప్రకారం.. ధూమపానం వల్ల ఎముకల నష్టం పెరుగుతుంది. దీనితో పాటు, సిగరెట్ లేదా ఇతర వస్తువులను తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత సమస్య కూడా ఉంది. ఇది ఎముక సమస్యలను కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి: Andhra Pradesh: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మద్యం షాపుల పనివేళలు పొడిగింపు

PM Narendra Modi: మా దేశంలో పెట్టుబడులకు ఇదే అనువైన సమయం: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోడీ..