PM Narendra Modi: మా దేశంలో పెట్టుబడులకు ఇదే అనువైన సమయం: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోడీ..

భారత్ లో పెట్టు బడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలకు ఇదే అనుకూల సమయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.  దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో  ఆయన  ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. 

PM Narendra Modi: మా దేశంలో పెట్టుబడులకు ఇదే అనువైన సమయం: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోడీ..
Pm Narendra Modi
Follow us
Basha Shek

| Edited By: Phani CH

Updated on: Jan 18, 2022 | 1:37 PM

భారత్ లో పెట్టు బడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలకు ఇదే అనుకూల సమయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.  దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో  ఆయన  ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్’ అనే అంశంపై ప్రసంగించిన మోడీ ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడలకు భారత్ ను గమ్య స్థానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటోన్న పలు చర్యలను ఆయన వివరించారు.  సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో భారత యువత ఎంతో ఉత్సుకతతో ఉందన్నారు.  ప్రపంచ దేశాల ఆలోచనలకు తగ్గట్లుగా వ్యాపారాన్వేషణ మార్గాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.  వీటితో పాటు గత కొన్నేళ్లుగా వివిధ రంగాల్లో మన దేశం సాధించిన అభివృద్ధిని మోడీ ప్రపంచ దేశాలకు వివరించారు.

 కరోనా కష్టకాలంలో భారత్ బలమేంటో చూపించాం..

‘కరోనా కారణంగా  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అయితే ఈ కష్ట కాలంలో నూ  సుమారు 80 కోట్ల మందికి పైగా దేశ పౌరులకు ఉచిత రేషన్ అందిస్తున్నాం. అదేవిధంగా 160 కోట్ల మందికి కరోనా టీకాలు అందించి  భారత్ బలమేంటో చూపించాం. ఇక కరోనా ను మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు ‘వన్ ఎర్త్- వన్ హెల్త్’ అనే నినాదంతో  పలు  ప్రపంచదేశాలకు  ఔషధాలు, కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేశాం. తద్వారా    మిలియన్ల మంది ప్రాణాలను  కాపాడాం.   భారత్ ప్రపంచంలోనే  మూడవ అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారుగా ఎదిగింది.   ఇక్కడి వైద్యులు తమ అసమాన సేవలతో అందరి మెప్పు పొందారు.   ఇక భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని ప్రోత్సహిస్తోంది.  ఐటీ రంగం రాత్రింబవళ్లు పని చేస్తూ రికార్డు స్థాయిలో సాఫ్ట్‌వేర్ నిపుణులను అందిస్తోంది. ‘

440 కోట్ల యూపీఐ లావాదేవీలు..

‘భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనువైన సమయం. 2014లో ఇక్కడ కేవలం వందల సంఖ్యలో మాత్రమే స్టార్టప్ లు ఉండేవి.  కానీ నేడు ఆ సంఖ్య  60 వేలకు పైగా దాటిపోయింది.  ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని   రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలకు సంబంధించి  భారత  నిర్ణయాలు తీసుకుంటోంది.  ‘మేక్ ఇన్ ఇండియా’, మేక్ ఫర్ ది వరల్డ్’ అనే ఆలోచనతో భారతదేశం నేడు ముందుకు సాగుతుంది. టెలికాం, ఇన్సూరెన్స్, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్‌తో పాటు, సెమీకండక్టర్ల రంగంలో కూడా భారతదేశం నేడు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.  డిజిటల్ ఇన్‌ఫ్రా రంగంలో  దేశం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది.  ఆరోగ్య సేతు యాప్, కోవిన్ పోర్టల్ భారతదేశానికి గర్వకారణం.  ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్ లో ఉంది. గత నెలలో యూపీఐ ద్వారా 440 కోట్ల  లావాదేవీల జరిగాయి.  భారతదేశం ప్రస్తుతం 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటోంది.  భారతీయులకు ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉంది ‘ అని మోడీ ప్రసంగించారు.  ఈ వర్చువల్ మీటింగ్ లో మోడీతో పాటు  జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఈయూ కమిషన్ చీఫ్ ఉర్సువా వాన్ డెర్ లేయన్ కూడా పాల్గొన్నారు.

Also Read: Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

 Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో జంట బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..

Assembly Elections 2022: ఒపీనియన్ పోల్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?