Vehicle with Scrap Viral Video: స్క్రాప్‌తో వెరైటీ వెహికిల్.. ముగ్ధుడై గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర..! ఆకట్టుకుంటున్న వీడియో..
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ మెటీరియల్‌తో ఫోర్ వీలర్‌ను తయారు చేశాడు. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు. స్క్రాప్ వస్తువులతో జీప్ తయారు చేసిన ఈ వ్యక్తి పేరు దత్తాత్రేయ లోహర్.
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ మెటీరియల్‌తో ఫోర్ వీలర్‌ను తయారు చేశాడు. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు. స్క్రాప్ వస్తువులతో జీప్ తయారు చేసిన ఈ వ్యక్తి పేరు దత్తాత్రేయ లోహర్. అతను ఎక్కువగా చదువుకోలేదు. తన కుమారుడి కోరికను తీర్చేందుకు ఆయన ఈ విశిష్ట వాహనాన్ని రూపొందించారు.జీప్ లాగా కనిపించే ఈ వాహనం కిక్-స్టార్ట్ సిస్టమ్‌ను కలిగిఉంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దానికి బదులుగా బొలెరోను కూడా వారికి అందిస్తానంటూ ప్రకటించాడు. ఈ జీప్ ఫ్రంట్ గ్రిల్ కూడా మహీంద్రా జీప్‌ను తలపిస్తుండడం విశేషం. మహారాష్ట్రలోని దేవరాష్ట్ర గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్ 60వేలతో ఈ వాహనాన్ని రెడీ చేశాడు. ఈ వాహనం మోటర్ బైక్ లాగా కిక్ తో స్టార్ట్ అవుతుంది. ఈ జీపులో మోటార్ సైకిల్ ఇంజన్ ఉందని తెలిపాడు దత్తాత్రేయ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దత్తాత్రేయ లోహర్ అద్భుతానికి నెటిజన్లు పిధా అవుతున్నారు.
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

