Viral Video: నాతోనే గేమ్సా.. బర్రెతో ఫోజులివ్వబోయి బొక్కబోర్లా పడిన చిన్నది.. నెట్టింట వీడియో వైరల్
Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాస్తవానికి
Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాస్తవానికి కారణం లేకుండా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదంటారు పెద్దలు. ఎందుకంటే కొన్నిసార్లు పరిణామాలు చాలా ప్రమాదకరంగా మారతాయి. ఓ మహిళ ఎలాంటి కారణం లేకుండా.. సరదా కోసం గేదెను వేధించింది. అయితే.. ఆమె ఊహించి ఉండదు అలా జరుగుతుందని.. అందరినీ.. నవ్విద్దామనుకున్న ఆమె చివరకు బొక్కబోర్లాపడింది. గెదెపై గెంతులు వేద్దామనుకున్నా ఈ చిన్నదానికి తగన శాస్తి జరిగిందంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
చాలా సార్లు కొందరు.. ఎలాంటి కారణం లేకుండా సరదా కోసం ఇతరులను వేధిస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియోలో నిలబడి ప్రశాంతంగా ఉన్న గేదెను చూడవచ్చు. అదే సమయంలో దాని దగ్గర ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె తన చేతులను గేదెపై వేసి.. ఆటపట్టిస్తుంటుంది. ఆ తర్వాత గెదె తలపై తన పాదాలను ఉంచుతుంది. ఇలా చేస్తూ మహిళ సంతోషపడుతుంటుంది. వెంటనే గేదెపై కూర్చోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, గేదె తలను వెనక్కి లాగుతుంది. ఈ క్రమంలో మహిళ బొక్కబోర్లాగా కిందపడిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..
వైరల్ వీడియో..
ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎవ్వరైనా ఇలా చేస్తే.. గుణపాఠం తప్పదంటూ కామెంట్లు చేస్తున్నారు. కారణం లేకుండా ఎవరినీ డిస్టర్బ్ చేయకండి.. చేస్తే ఇలానే ఉంటుందంటున్నారు. ఈ ఫన్నీ వీడియోని నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ‘నిర్మలా వైష్ణవ్’ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగావీక్షించారు. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయడంతోపాటు.. పలు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: