Mustard Seeds Benefits: ఆవాలతో ప్రయోజనాలున్నట్లే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయ్.. అవేంటంటే..

Mustard Seeds Benefits: ఆవాలతో ప్రయోజనాలున్నట్లే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయ్.. అవేంటంటే..

Mustard Seeds Benefits: ఆవాలు బ్రాసికేసి కుటుంబానికి చెందినవి. రైతులు సైతం ఆవాల సాగుకు ఎక్కువ మొగ్గు చూపుతారు.

Shiva Prajapati

|

Jan 18, 2022 | 1:41 PM

Mustard Seeds Benefits: ఆవాలు బ్రాసికేసి కుటుంబానికి చెందినవి. రైతులు సైతం ఆవాల సాగుకు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఆవాల సాగుకు 5వేల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, మనకు తెలిసింది ఒక్కటి మాత్రమే. ఆవాలలో 40 రకాల ఆవాల మొక్క జాతులు ఉంటాయి. వీటిలో మూడు మాత్రం మనం వినియోగిస్తాం. నలుపు, గోధుమ, తెలుగు రంగు ఆవాలను వంటకాల్లో వేస్తుంటారు.

ఆవాల మొక్కలో, గింజలు, ఆకులు, పువ్వులు తినదగినవి. ఇది క్యాబేజీ, టర్నిప్‌ల జాతికి చెందిన మొక్క. బ్రాసికా నిగ్రా అనే మొక్క నల్ల ఆవాలను ఉత్పత్తి చేస్తుంది. ఉత్తర ఆఫ్రికా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియాకు చెందిన కొన్ని ప్రాంతాలు, మధ్యప్రాచ్యంలో బాగా ప్రాచుర్యం పొందాయి.

ఆవపిండి ఉపయోగాలు.. ఆవాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటి ఆకులలో కాల్షియం, రాగి, విటమిన్లు సి, ఎ, కె అధికంగా ఉంటుంది. ఆవ గింజల్లో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఆవాలను, ఆవ పిండిని, ఆవ ఆకులను సలాడ్‌లు, సూప్‌లు, వంటలలో వినియోగిస్తారు. వాటిని పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. ఆవ ఆకులను బచ్చలికూర మాదిరిగానే వండుకోవచ్చు. అయితే, రుచి పరంగా కాస్త తేడాగా ఉంటుంది. ఇకపోతే, ఆవ గింజలను నానబెట్టి, మరుసటి రోజున ఆవాలను పేస్ట్ చేయాలి. గోరువెచ్చని పాలలో వేసుకుని తాగవచ్చు. లేదంటే.. భోజనం తినే సమయంలోనైనా దానిని తీసుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు.. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉన్నందున ఆవాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఆవాలు ఒక భాగం. ఆవపిండి కొన్ని సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది.. శరీరంలో క్యాన్సర్ వ్యాప్తిని నిలువరిస్తుంది. ఆవాలలోని గ్లూకోసినోలేట్లు క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

సోరియాసిస్ లక్షణాలను తగ్గిస్తుంది.. సోరియాసిస్ మోకాళ్లు, మోచేతులు, మెడ, నెత్తిమీద ఏర్పడుతుంది. ఎరుపు, దురదతో కూడిన పొలుసుల మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ సోరియాసిస్‌ను కట్టడి చేయడంలో ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయట.

చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది.. చర్మ సంబంధిత వ్యాధులను నివారించడంలో ఆవాలు అద్భుతంగా పని చేస్తాయి. దురడ, పొడి చర్మం, దద్దుర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది పొక్కులు, స్రావాలు, క్రస్టింగ్, చర్మం పొలుసులుగా మారడం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అంటువ్యాధుల నివారణకు.. ఆవాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అంటు వ్యాధుల నివారణా చికిత్సలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాల అభివృద్ధికి తోడ్పడుతాయి.

ఆవపిండి సైడ్ ఎఫెక్ట్స్.. చాలా మంది వ్యక్తులు ఆవపిండిని తినడాన్ని సురక్షితంగా భావిస్తారు. అయితే, సాధారణ నిష్పత్తిలో తీసుకుంటే ఆరోగ్యకరమే అయినప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవ పిండిని అతిగా తింటే.. కడుపు నొప్పి, విరేచనాలు, గట్ ఇన్ఫ్లమేషన్ ఏర్పడవచ్చు అని చెబుతున్నారు. ఆవాల్లో గోయిట్రోజెన్‌లు అనే పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి మీ జీవక్రియను నియంత్రించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి, ఆవాలను మితంగా తీసుకుంటేనే మేలు జరుగుతుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

Also read:

LPG Insurance Policy: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలితే పరిహారం కోరచ్చని మీకు తెలుసా?.. ఇప్పుడే వివరాలు తెలుసుకోండి..

Pragna Sree: బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ చిచ్చర పిడుగు ప్రజ్ఞా శ్రీ.. చిన్నవయస్సులోనే ఎన్నో సేవలు

CM Jagan – ChandraBabu: మీరు త్వరగా కోలుకోవాలి.. ట్వీట్ చేసిన సీఎం జగన్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu