Health Tips: మీకు కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోందా..? వీటిని తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు..!

Health Tips: ఇప్పుడున్న కాలంలో చాలా మందికి కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది. దీని కారణంగా పలు అరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు...

Health Tips: మీకు కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోందా..?  వీటిని తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2022 | 12:42 PM

Health Tips: ఇప్పుడున్న కాలంలో చాలా మందికి కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది. దీని కారణంగా పలు అరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యాయమాలు చేయకపోవడం, తీసుకునే ఆహారం కారణంగా కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మనం తీసుకునే ఆహార నియమాలు పాటించినట్లయితే కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు వీటిని ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఈ పండ్లను సౌంద‌ర్య సాధ‌నాల్లో కూడా వాడుతుంటారు. తియ్య‌గా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ఎంతగానే స‌హాయ‌ప‌డుతాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండ‌డంతో చర్మ సమస్యలకు ఉపయోగకరంగా ఉంటుంది.

యాపిల్స్

యాపిల్స్ పండ్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్ర‌తిరోజూ ఒక యాపిల్ తింటే డాక్ట‌ర్ వ‌ద్దకు కూడా వెళ్ల‌న‌వ‌స‌రం లేదంటుంటారు. ఇందులో పెక్టిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఫైబ‌ర్ కంటెంట్‌ తగిన మోతాదులో ఉండటంతో ఆరోగ్యానికి చాలా మంచిది.

సిట్ర‌స్ పండ్లు

నారింజ‌, నిమ్మ‌, ద్రాక్ష మొద‌లైన‌వి సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లు. ఇందులో సీ విట‌మిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చ‌లికాలంలో విరివిగా ల‌భిస్తాయి. ఈ పండ్లు కొలెస్ట్రాల్ త‌గ్గించ‌డంలో కీలక పాత్ర పోషిస్తాయి. విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉంటుంది.

ద్రాక్ష

కొలెస్ట్రాల్‌ కోసం ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి బ‌రువు తగ్గడంతో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ద్రాక్ష ఎంతగానో స‌హాయ‌ప‌డుతుందని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.

ఇవి కూడా చదవండి:

Blood Pressure: మీకు బీపీ ఉందా…? చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Health Tips: రోగనిరోధక శక్తి కోసం టాబ్లెట్స్‌ వాడొద్దు.. ఈ నాచురల్ ఫుడ్స్ ట్రై చేయండి.. బెటర్ రిజల్ట్స్‌ మీ సొంతం..!