Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రోగనిరోధక శక్తి కోసం టాబ్లెట్స్‌ వాడొద్దు.. ఈ నాచురల్ ఫుడ్స్ ట్రై చేయండి.. బెటర్ రిజల్ట్స్‌ మీ సొంతం..!

Immunity Boost foods: చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి(Vitamin C), జింక్(Zinc), విటమిన్ డి((Vitamin D) వంటి విటమిన్ల టాబ్లెట్లను తీసుకుంటుంటారు. అయితే వీటిని..

Health Tips: రోగనిరోధక శక్తి కోసం టాబ్లెట్స్‌ వాడొద్దు.. ఈ నాచురల్ ఫుడ్స్ ట్రై చేయండి.. బెటర్ రిజల్ట్స్‌ మీ సొంతం..!
Vitamin C Facts
Follow us
Venkata Chari

|

Updated on: Jan 17, 2022 | 5:09 PM

Covid-19: కరోనా వైరస్(Coronavirus) కేసులు మరోసారి పెరగడం ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితిలో దాని తీవ్రతను తగ్గించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కీలకంగా మారింది. అదే సమయంలో చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి(Vitamin C), జింక్(Zinc), విటమిన్ డి((Vitamin D) వంటి విటమిన్ల టాబ్లెట్లను తీసుకుంటుంటారు. అయితే వీటిని సాధారణ ఆహారం, పానీయాల నుంచి పొందడంతో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడతాయి. కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు దూరంగా ఉండాలంటే మాత్రం మీ ఆహారంలో జింక్, విటమిన్ సి అధికంగా ఉండే వాటిని చేర్చుకోవడం చాలా ముఖ్యం. అయితే ఎలాంటి సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారంలో విటమిన్ సి, జింక్‌ని ఇలా చేర్చుకోండి-

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలు- ఆరెంజ్ – ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని జ్యూస్‌ చేసుకోని తాగితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల ఆరెంజ్‌ను మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి.

జామ – జామపండులో విటమిన్ సి ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా మేలు చేస్తుంది. మీరు నల్ల ఉప్పుతో జామను కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

నిమ్మకాయ – నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరం నుంచి నిర్జలీకరణాన్ని తొలగిస్తుంది. అలాగే చలి నుంచి కూడా రక్షిస్తుంది.

జింక్ అధికంగా ఉండే ఆహారాలు- మాంసం, సముద్ర ఆహారాలు- మాంసం జింక్‌కు అద్భుతమైన మూలం. దీనితో పాటు, సముద్రపు ఆహారంలో జింక్ పుష్కలంగా ఉంటుంది. మాంసం, సీఫుడ్ తినేటప్పుడు, దాని పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచింది.

గింజలు- గుమ్మడికాయ, నువ్వులు వంటి కొన్ని గింజలు మంచి మొత్తంలో జింక్‌ను కలిగి ఉంటాయి. అదనంగా, అవి ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ల‌కు మంచి మూలంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. వీటిని చికిత్స/మందు/ఆహారంగా తీసుకోవాలనుకుంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించి, సరైన సలహాలు తీసుకోవాలి.

Also Read: Garlic: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే..?

Health News: ఈ మూడు జ్యూస్‌లు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి..! అవేంటంటే..?