AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan – ChandraBabu: మీరు త్వరగా కోలుకోవాలి.. ట్వీట్ చేసిన సీఎం జగన్..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

CM Jagan - ChandraBabu: మీరు త్వరగా కోలుకోవాలి.. ట్వీట్ చేసిన సీఎం జగన్..
Cm Jagan On Bab
Sanjay Kasula
|

Updated on: Jan 18, 2022 | 1:31 PM

Share

CM Jagan – ChandraBabu: టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి చంద్రబాబు వేగంగా రికవరీ కావాలని.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వైఎస్ జగన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చంద్రబాబు ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు సీఎం జగన్. మంగళవారం జనవరి 18, 2022నాడు చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కుమారుడు నారా లోకేశ్ కు ఒకరోజు ముందు.. సోమవారం నాడు కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో.. లోకేశ్ ఐసోలేట్ అయ్యారు. ఆ మర్నాడు చంద్రబాబుకు కూడా స్వల్పంగా జలుబు కావడంతో.. టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్ రావడంతో.. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నారు చంద్రబాబు. లోకేష్‌కు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఇంట్లో ఉన్నవారంతా పరీక్షలు చేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

ఇప్పుడు మీ ఫోన్ వాకీ టాకీ మార్చుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..