LPG Insurance Policy: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలితే పరిహారం కోరచ్చని మీకు తెలుసా?.. ఇప్పుడే వివరాలు తెలుసుకోండి..
LPG Insurance Policy: ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రావు. అనుకోని విధంగా, ఊహించని రీతిలో ప్రమాదాలు జరుగుతుంటాయి.
LPG Insurance Policy: ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రావు. అనుకోని విధంగా, ఊహించని రీతిలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ప్రమాదాల్లో వ్యక్తుల ప్రాణాలే కోల్పోతుంటారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నప్పటికీ.. దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే, చాలావరకు ఊహించని విధంగా గ్యాస్ సిలిండర్ పేలుళ్లు జరుగుతుంటాయి. అయితే, బ్యాంకుల ద్వారా తీసుకునే డెబిట్/క్రెడిట్ కార్డుపై ఉచిత ప్రమాద బీమా గురించి తెలియనట్లే.. భారతదేశంలో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల సంభవించే మరణం, ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టంపైనా బీమా ఉంది. చాలా మందికి ఈ బీమా గురించి పెద్దగా సమాచారం తెలియదు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పేలితే.. క్లెయిమ్ చేసే రైట్ ప్రజలకు ఉంది. మరి దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ LPG గ్యాస్ బీమా పాలసీ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) చేసిన బీమా పాలసీ. భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్లు పొందే గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్‌ను పోలి ఉంటుంది. అయితే, ఇది కస్టమర్లను శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీమా పాలసీని చేస్తాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. బాధితులకు తక్షణ ఉపశమనం అందించడానికి ‘పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండ్రస్ట్రీస్’ క్రింద సమగ్ర బీమా పాలసీలను కొనుగోలు చేస్తాయి. LPG సంబంధిత ప్రమాదాలకు గురై.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలలో ఏదేనీ కంపెనీ కస్టమర్ అయిన వారందరికీ ఇది వర్తిస్తుంది.
ఎవరికి వర్తిస్తుంది?.. ఎంత వర్తిస్తుంది?.. OMCల పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ.. ఎల్‌పిజి ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలను కవర్ చేస్తుంది. (i) I మరణం సంభవించినప్పుడు ఒక్కొక్కరికి రూ. 6,00,000/- వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ ఇస్తారు. (ii) ఒక వ్యక్తికి రూ. 2,000,000/- పరిమితితో ఒక్కో ఈవెంట్‌కు రూ. 30 లక్షల వరకు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. (iii) ఆస్తి నష్టం జరిగినప్పుడు, ఇది కస్టమర్ అధీకృత ప్రదేశాలలో నమోదిత చిరునామాలో జరిగే ప్రతి సంఘటనకు గరిష్టంగా రూ.2,00,000/- వర్తిస్తుంది.
కస్టమర్‌లకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషలలో బీమా బ్రోచర్‌ను ఇస్తాయి. వాటిలో ప్రమాద బీమాకు సంబంధించిన అన్ని వివరాలను పేర్కొంటారు. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ సమాచారం OMC వెబ్‌సైట్‌లలో పబ్లిక్ డొమైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఎలా క్లెయిమ్ చేయాలి? 1. ప్రమాదం జరిగినప్పుడు పంపిణీదారునికి.. బాధితుడు లేదా బాధితుడి కుటుంబం వీలైనంత త్వరగా వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలి. 2. ఆ తర్వాత పంపిణీదారు సంబంధిత ఆయిల్/గ్యాస్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేస్తాడు. 3. ఆయిల్/గ్యాస్ కంపెనీలు ప్రమాదం నుండి ఉత్పన్నమయ్యే బీమా క్లెయిమ్‌ల ప్రక్రియలను పూర్తి చేయడంలో సంబంధిత కస్టమర్‌కు లేదా వారి బంధువులకు సహాయం చేస్తాయి. 4. పైన పేర్కొన్న వాటితో పాటు, LPG ప్రమాదం జరిగినప్పుడు నష్టాలను కవర్ చేసేందుకు అన్ని ఎల్‌పీజీ పంపిణీదారులు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ని కలిగి ఉంటారు.
PSU ఆయిల్ కంపెనీలు అన్ని నమోదిత LPG వినియోగదారులకు బీమా కవరేజీని తీసుకున్నాయి. పరిహారం గురించి మరింత తెలుసుకోవడానికి సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదా సమీపంలోని శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి.
Also read:
Health Tips: మీకు కొలెస్ట్రాల్ పెరిగిపోతోందా..? వీటిని తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు..!
Viral News: స్పైడర్‌మాన్ పుస్తకంలోని ఓ పేజీ.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!