షాకిస్తున్న పసిడి.. రెండు రోజుల్లోనే రూ.6000 పెరిగిన బంగారం ధర.. 

13 April 2025

Subhash

బంగారం, వెండి ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి.

బంగారం, వెండి ధరలు

కేవలం రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 6000 రూపాయల వరకు ఎగబాకింది. ఇక వెండి కూడా భారీగానే పెరుగుతోంది.

కేవలం రెండు రోజుల్లోనే 

ప్రస్తుతం తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. రానున్న రోజుల్లో లక్ష రూపాయల మార్క్‌ దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తులం బంగారం ధర

ఏప్రిల్‌ 13వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర87,770 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 95,670 వద్ద కొనసాగుతోంది.

దేశీయంగా

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 95,670 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 95,670 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ముంబైలో

ఇక దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 95,820 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో

ఇక వెండి ధర కూడా బంగారం బాటలో పయనిస్తోంది. కిలో వెండిపై కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర  లక్ష రూపాయల వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ.లక్షా 10 వేలు ఉంది.

వెండి ధర