AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs MI: ఢిల్లీ గడ్డపై తెలుగోడి వీరోచిత ఇన్నింగ్స్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

Delhi Capitals vs Mumbai Indians, 29th Match: ఐపీఎల్ 29వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ అర్ధ సెంచరీ సాధించాడు. ర్యాన్ రికెల్టన్ 41 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు చేశారు.

DC vs MI: ఢిల్లీ గడ్డపై తెలుగోడి వీరోచిత ఇన్నింగ్స్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
Delhi Capitals Vs Mumbai Indians, 29th Match
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2025 | 9:39 PM

Delhi Capitals vs Mumbai Indians, 29th Match: ఐపీఎల్ 29వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ర్యాన్ రికెల్టన్ 41 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు చేశారు.

ఢిల్లీ తరపున స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ 18 పరుగులు చేసి ఔట్ కాగా, హార్దిక్ పాండ్యా 2 పరుగులు చేసి ఔట్ అయ్యారు. నమన్ ధీర్ 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతను తిలక్ తో ఫిఫ్టీ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, అశ్వని కుమార్, రాజ్ బావా, కర్ణ్ శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: దర్శన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెరీరా, దుష్మంత చమీరా.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..