Video: వామ్మో.. క్యాచ్ కోసం వెళ్లి ఇలా ఢీ కొన్నారేంది భయ్యా.. గాయాలతో మైదానం నుంచి ఔట్
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు భారీ ప్రమాదం తప్పింది. క్యాచ్ కోసం వెళ్లిన ఇద్దరు ప్లేయర్లు గట్టిగా ఢీ కొనడంతో కిందపడిపోయారు. దీంతో ఇద్దిరికీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ ప్లేయర్లు మైదానం వీడాల్సి వచ్చింది.

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు భారీ ప్రమాదం తప్పింది. క్యాచ్ కోసం వెళ్లిన ఇద్దరు ప్లేయర్లు గట్టిగా ఢీ కొనడంతో కిందపడిపోయారు. దీంతో ఇద్దిరికీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ ప్లేయర్లు మైదానం వీడాల్సి వచ్చింది. ముంబై ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు ఫీల్డర్లు అశుతోష్, ముఖేష్ కుమార్ ఢీకొనడంతో అంతా షాకయ్యారు.
మోహిత్ శర్మ వేసిన బంతిని తిలక్ వర్మ షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు కొట్టాడు. బంతి గాల్లోకి లేవడంతో అశుతోష్, ముఖేష్ ఇద్దరూ క్యాచ్ తీసుకునేందుకు వచ్చారు. కానీ, చివరికి ఒకరినొకరు ఢీకొట్టారు. క్యాచ్ మిస్సవ్వడంతో మూడు పరుగులు వచ్చాయి.
😂😂😂#MIvsDC #DCvsMI pic.twitter.com/YvJ3TF0qzh
— A J (@dummytool) April 13, 2025
ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో చికిత్స చేయడానికి ఫిజియో వెంటనే రంగంలోకి రావాల్సి వచ్చింది. మొదట్లో ఇద్దరు ఆటగాళ్లు స్పృహలో ఉన్నట్లు, స్పందించినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వాళ్లిద్దరి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో.. మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇద్దరు ఆటగాళ్లను తాత్కాలికంగా ఆటకు దూరంగా ఉంచడంతో ఢిల్లీ క్యాపిటల్స్ వెంటనే ఫీల్డింగ్ సర్దుబాట్లు చేయాల్సి వచ్చింది.
ఆ సమయంలో, ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 184/4తో ఉంది. తిలక్ వర్మ 30 బంతుల్లో 57 పరుగులు, నమన్ ధీర్ 11 బంతుల్లో 20 పరుగులు సాధించారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..