Shweta Tiwari: తస్సాదియ్యా.. సోషల్ మీడియాను ఆగమాగం చేస్తోన్న తల్లికూతుర్లు.. ఈ నటి డాటర్ను చూశారా.. ?
సినీరంగుల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా తివారీ. బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఆమె. వరుస సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు కూతురు ర్యాంప్ వాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అందంలో తల్లిని మించి పోయింది.

బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక నటి శ్వేతా తివారి. హిందీలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన కసౌటి జిందగీ కె సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ అమ్మడు. ఇందులో ప్రేరణ శర్మ పాత్రలో అద్భుతమైన నటనతో.. అందంతో కట్టిపడేసింది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర పై మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దాదాపు ఏడేళ్లపాటు ఈ సీరియల్ సాగింది. ఇందులో ప్రేరణ శర్మ పాత్రకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. అందులో విజేతగా నిలిచింది. ఆ తర్వాత సీరియల్స్, టీవీషోల ద్వారా మరింత బిజీ అయ్యింది. కానీ శ్వేత తివారీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.
రెండుసార్లు, ప్రేమ, పెళ్లిలో మోసపోయింది. 1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్వేతా తివారి. వీరికి పాలక్ తివారి అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న శ్వేతా.. 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకోగా.. వీరికి రేయాన్స్ కోహ్లీ జన్మించాడు. కానీ ఈ బంధం ఎక్కుకు రోజులు సాగలేదు. 2019లో వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. ప్రస్తుతం శ్వేతా తివారి తన కూతురు, కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం సీరియల్స్ ద్వారా బిజీగా ఉంది శ్వేతా తివారి. తాజాగా ఈ అమ్మడు కూతురు పాలక్ తివారీ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ప్రస్తుతం హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ది భూత్నీ చిత్రంలో నటిస్తుంది. సిద్ధాంత్ సచ్ దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాత్రలో నటించింది పాలక్ తివారీ. తాజాగా ఓ ఫ్యాషన్ వేడుకలో పాల్గొన్న పాలక్ తివారీ ర్యాంప్ వాక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
ఇవి కూడా చదవండి :