Venu Madhav : అలా చేసి ఉంటే నా భర్త బతికేవారు.. ఇప్పుడు మా పరిస్థితి ఇలా.. వేణు మాధవ్ భార్య కన్నీళ్లు..
తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతో మంది కమెడియన్స్ తమ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. జీవితంలో ఎన్ని కష్టాలు.. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. వెండితెరపై చెరగని చిరునవ్వుతో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటులలో వేణు మాధవ్ ఒకరు. ఆయన మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు.

టాలీవుడు సినీప్రియులను తన నటనతో, కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ వేణు మాధవ్. ఎన్నో సినిమాల్లో నటుడిగా, హాస్య నటుడిగా మెప్పించి ఆయన.. ఉన్నట్లుండి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. 2019 సెప్టెంబర్ 25న ఆయన కన్నుమూశారు. కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ఇప్పటికీ సినిమా ప్రపంచానికి తీరని లోటు. వేణు మాధవ్ మృతి తర్వాత ఆయన ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కొన్నాళ్ల క్రితం వేణు మాధవ్ భార్య, కుమారులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నరాు. ఆయన మృతికి కారణాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో వేణు మాధవ్ మృతికి తాగుడు, స్మోకింగ్ లాంటి వ్యసనాలకు అలవాటు పడడమే అనే రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై ఆయన భార్య శ్రీవాణి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
తమ వివాహం జరిగిన సమయానికి వేణుమాధవ్ సినీ రంగంలో అప్పుడప్పుడే అడుగు పెడుతున్నారని ఆమె తెలిపారు. ఆయన ఎంతగానో ప్రేమగా, శ్రద్ధగా చూసుకునే భర్త అని, ఎవరైనా చూస్తారో లేదో అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఆయనదని ఆమె అన్నారు. కుటుంబంలో వేణుమాధవ్ గారు అందరితోనూ చాలా ఆత్మీయంగా మెలిగేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయనను మమ్మీకి పెద్దక్కలా అనిపించగా, డాడీకి పెద్దన్నయ్యలా కనిపించేవారట. అంతేకాదు, తమకు ఒక తమ్ముడిలా ఉండేవారని కూడా ఆమె చెప్పారు, అంటే ఆయన అందరితోనూ కలివిడిగా, చిన్నపిల్లవాడిలా సరదాగా ఉండేవారని అన్నారు. నటుడి జీవితం చాలా కష్టమైనదని, అది మనం అనుకున్నంత సులభం కాదని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
తన భర్త చనిపోకముందే మరణించారని వార్తలు వచ్చాయని.. అలాగే ఆయనపై నెగిటివ్ ప్రచారం కూడా జరిగిందని అన్నారు. కానీ తన భర్త డెంగ్యూ ఫీవర్ రావడం వల్లే మరణించారని.. సరైన కేర్ తీసుకోకపోవడమే ఆయన ప్రాణాల మీదకు తీసుకువచ్చిందని అన్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు వేణు మాధవ్.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాతో బ్రేక్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
