Tollywood: ఆర్టీసీ డ్రైవర్ కొడుకు.. ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు ఇతను సినిమా చేస్తే సూపర్ హిట్టే
సినిమాలన్నాక హిట్స్, ఫ్లాప్స్ ఉంటాయి. హీరోలు, హీరోయిన్లు, దర్శకులకైనా ఇది సహజమే. అయితే కొందరు మాత్రం అపజయమనేది ఎరగకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతుంటారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుంటారు. అలా ఇతను కూడా ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా విజయాలు అందుకుంటున్నాడు.

టాలీవుడ్ లో ది గ్రేట్ రాజమౌళికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేంటంటే.. ఆయన ది మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. జక్కన్న ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మరికొన్ని ఇండస్ట్రీ హిట్ ఉన్నాయి. ది గ్రేట్ రాజమౌళి లాగే ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీ, నాగ్ అశ్విన్, వెట్రి మారన్.. ఇలా చాలా మంది దర్శకుల కెరీర్ లో పరాజయాలు లేవు. వీరు తెరకెక్కించిన సినిమాలన్నీ కనీసం యావరేజ్ గా నిలిచాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందుతాడు. అతను ఇప్పటివరకు 8 సినిమాలు చేశాడు. అన్నీ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అంటే 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నమాట. ఈ కారణంగానే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీశాడు. మరో సూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. నేపథ్యంలో అనిల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఓ సందర్భంలో తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడీ స్టార్ డైరెక్టర్..‘మా నాన్న ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్. నెలకు నాలుగు వేల రూపాయల జీతం. అయినా నాకు ఏ లోటు రాకుండా పెంచాడు. బాగా చదివించాడు. నాకు ఎంసెట్ లో 8000 ర్యాంక్ వచ్చింది. అయినా ఒక మంచి కాలేజీలో పేమెంట్ సీట్ తీసుకుని నన్ను బాగా చదివించాడు. ఇందుకోసం ఏడాదికి 45 వేలకు పైగా ఖర్చు పెట్టేవాడు. అప్పట్లో అందులోనూ నెలకు 4 వేల రూపాయల జీతం తీసుకునేవాడికి ఇది చాలా ఎక్కువ. నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఆయన జీతం ఏ మాత్రం సరిపోదు. అయినా నా కోసం, నా చదువు కోసం లోన్లు తీసుకున్నాడు. వాటిని తీర్చడానికి చాలా కష్టపడాడు’ అని భావోద్వేగంతో మాట్లాడాడు అనిల్ రావిపూడి.
సినిమా సెట్ లో అనిల్ రావిపూడి..
View this post on Instagram
ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే.. ఈ మెగా మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో కనిపించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




