OTT Movie: మన మధ్యన ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..
తెలంగాణలోని అమ్మాయిల జీవిత కథల ఆధారంగా దీనిని నిర్మించారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. ఈ క్రమంలో ఈ క్రైమ్ సిరీస్ ను చూసిన చాలామంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. గత 10-15 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో మిస్సైన మహిళలు, ఆ కేసుల విచారణలో వెలుగు చూసిన సంచలన నిజాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన మూడు సెన్సేషనల్ కేసులను ఇందులో చూపించారు. ముందుగా హజీపూర్ కేస్. రాత్రిపూట ఇంటి నుంచే వెళ్లిపోయిన ఓ అమ్మాయి ఆ తర్వాత కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత వరంగల్ కేస్. ఒక కాలేజీ అమ్మాయి బస్ స్టాప్ దగ్గరి నుంచి ఉన్నట్లుండి మిస్ అవుతుది. ఆ తర్వాత ఎక్కడా కానీ ఆమె దాఖలాలు కనిపించవు. మూడవది యెల్లపటార్ కేస్. ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లిన అమ్మాయి ఇప్పటివరకు తిరిగి రాలేదు.
ఈ మూడు కేసులతో పాటు తెలంగాణలో మహిళలు, బాలికలు అదృశ్యమవుతున్న ఇతర కేసులు, సంఘటనలు, బాధితుల స్మేట్మెంట్ ను ఇందులో చూపించారు. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఈ సిరీస్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో దీనిపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ‘సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’ (Silent Screams – The Lost Girls Of Telangana). జనవరి 08 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. అరవింద్ మేనన్ దీనికి దర్శకత్వం వహించారు.
సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..
Some pain doesn’t scream… it lingers in silence. 🖤 Enter the eerie world of #SilentScreams, streaming on #SunNXT from Jan 8, with voice lent by #ShrutiHaasan.
Feel the chill. 👁️🔥#Jan8Release #SilentScreamsOnSunNXT
watch Here: https://t.co/xI07BGTq2p pic.twitter.com/xj4K5Ad73c
— Phani Kandukuri (@phanikandukuri1) January 9, 2026
Telugu true-crime documentary feature #SilentScreams : #TheLostGirlsOfTelangana premieres Jan 8th on @sunnxt.pic.twitter.com/TegWJuep69
— CinemaRare (@CinemaRareIN) January 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




