Akshaye Khanna: 50 ప్లస్‌లోనూ ఇంత ఫిట్‌గా.. ‘ధురంధర్’ విలన్ ఫిట్‌నెస్ అండ్ డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం 'ధురంధర్' చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటుడు అక్షయ్ ఖన్నా. ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఈ 50ప్లస్ యాక్టర్ తన డైట్ ప్లాన్ అలాగే ఫిట్‌నెస్ రొటీన్ ను షేర్ చేశాడు.

ఈ ఏడాది ప్రారంభంలో ఛావా సినిమాలో జౌరంగ జేబు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు బాలీవడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా. ఇప్పుడు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్’ సినిమాలోనూ ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించి మరోసారి టాక్ ఆ ది టౌన్ అయ్యాడీ బాలీవుడ్ స్టార్. ఈ చిత్రంలో, క్రూరమైన రెహ్మాన్ డకైట్ పాత్రలో కనిపించాడు అక్షయ్ ఖన్నా. తన అద్భుతమైన నటనతో హీరో కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కాగా ధురంధర్ సినిమాలో అక్షయ్ నటనతో పాటు 50 ఏళ్ల అతరి ఫిట్‌నెస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అతని ఫిట్‌నెస్ రొటీన్, డైట్ ప్లాన్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి ఇంటర్వ్యూలో, అక్షయ్ తన దినచర్య అలాగే ఆహారపు అలవాట్ల గురించి చెప్పాడు. ఆసక్తికరంగా సినిమా షూటింగ్ సమయంలోనూ ఇదే దినచర్యను అనుసరిస్తానని చెప్పుకొచ్చాడు.
‘నేను ఎప్పుడూ అల్పాహారం తీసుకోను. మధ్యాహ్నం ఫుల్ మీల్స్ అలాగే రాత్రి డిన్నర్ చేస్తాను. లంచ్, డిన్నర్ మధ్య నేను ఏమీ తినను. శాండ్‌విచ్‌లు లేదా బిస్కెట్లు వంటి స్నాక్స్ కూడా తినను. అయితే సాయంత్రం పూట ఒక కప్పు టీ మాత్రమే తాగుతాను. అది నాకు సరిపోతుంది. నా ఆహారం గురించి నాకు చాలా అవగాహన ఉంది. నేను పెద్దగా ఏమీ తినను. నా భోజనం చాలా సింపుల్ గా, బ్యాలెన్స్ గా ఉంటుంది. లంచ్ లోకి పప్పు, అన్నం తింటాను. దానితో పాటు, నేను ఎప్పుడూ వెజిటేబుల్ లేదా చికెన్ లేదా చేప లేదా నాన్ వెజ్ డిష్ తీసుకుంటాను. డిన్నర్ కి నేను ఏదైనా వెజిటేబుల్ తో చపాతీ తింటాను, చికెన్ డిష్ కూడా తీసుకుంటాను. చాలా సార్లు, నా భోజనం ఇలాగే ఉంటుంది. షూటింగ్ సమయంలో కూడా నా డైట్ ఒకటే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే నేను 10 గంటలు నిద్రపోతాను’అని అక్షయ్ ఖన్నా చెప్పుకొచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో అక్షయ్ తనకు ఇష్టమైన ఆహారం గురించి కూడా చెప్పాడు. అక్షయ్ కి తీపి పదార్థాలు కూడా చాలా ఇష్టం. వాటిలో కేక్ అంటే అతనికి చాలా ఇష్టం. దీనితో పాటు, పండ్లలో లిచీ, కూరగాయలలో ఓక్రా అతనికి చాలా ఇష్టమని పేర్కొన్నాడీ బాలీవుడ్ సీనియర్ యాక్టర్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




