The Raja Saab: ‘ది రాజాసాబ్’ సినిమాకు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదా? మారుతి ముందుగా అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా శుక్రవారం (జనవరి 09) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ప్రభాస్ అభిమానులు ఊహించిన రేంజ్ లో మూవీ లేకపోయినప్పటికీ యావరేజ్ టాక్ మాత్రం తెచ్చుకుంది.

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ది రాజాసాబ్ సినిమా శుక్రవారం (జనవరి 09) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్, కల్కి రేంజ్ లో సూపర్ హిట్ టాక్ రానప్పటికీ ప్రభాస్ అభిమానులను మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నాడు రాజాసాబ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ ను చూశామని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రభాస్ డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సులతో కామెడీ కూడా అదరగొట్టాడని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కామెడీతో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సముద్ర ఖని, జరీనా వాహబ్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేశ్, ప్రభాస్ శీను, సప్తగిరి తదితరులు వివిధ పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ సుమారు రూ.450 కోట్ల బడ్జెట్ తో ది రాజాసాబ్ సినిమాను నిర్మించారు. తమన్ స్వరాలు అందించారు.
కాగా సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ది రాజాసాబ్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసాబ్ సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ కాదని, మరో హీరోతో ఈ మూవీ చేయాల్సిందని నెట్టింట వినిపిస్తోంది. ఇంతకీ ది రాజాసాబ్ కు మారుతి ముందుగా అనుకున్న ఆ హీరో ఎవరనుకుంటున్నారా? కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. అవును మారుతి ముందగా సూర్య తోనే ఈ మూవీ చేయాలనుకున్నాడట. కథ కూడా వినిపించేందుకు రెడీ అయ్యాడట. అయితే అంతలోనే ప్రభాస్ డేట్స్ ఇవ్వడంతో ఇదే కథను వినిపించాడట. అలా ది రాజాసాబ్ ప్రాజెక్టులోకి ప్రభాస్ వచ్చాడట.
నార్త్ లో ది రాజాసాబ్ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్..
North India is completely SOLD on this KING SIZE experience 💥💥💥
It’s a PAN INDIA CELEBRATION being hailed and celebrated in the grandest way for #TheRajaSaab 😍🙏🏻
— https://t.co/ds1lIEmogW#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy… pic.twitter.com/ONufMZgeaB
— People Media Factory (@peoplemediafcy) January 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




