ఆ స్టార్ హీరో చెప్పమన్న రెండు జోకులు.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం రేంజే మార్చేశాయి..
రంగస్థలం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ధర్మవరపు సుబ్రమణ్యం. వందలాది సినిమాల్లో నటించిన ఆయన తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఓ వైపు వెండితెరపై మెరుస్తూనే బుల్లితెరపైనా అదరగొట్టారు. తన నటనా ప్రతిభకు ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారీ స్టార్ కమెడియన్.

సిల్వర్ స్క్రీన్ పై నవ్వులను పంచి.. తమ కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. తనదైన మ్యానరిజంతో, కామెడీ టైమింగ్ తో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. కామెడీలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉండేది. తెలుగు వారి హృదయాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. 2013లో లివర్ క్యాన్సర్ సమస్యతో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోకి రాక ముందు, వచ్చిన తర్వాత ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి గారి ఇంట్లో జరిగిన ఓ సమావేశం, అక్కడ ఆయన చెప్పిన జోకులు, తన రంగస్థల ప్రస్థానం, కవిత్వంపై తనకున్న అభిమానం వంటి విషయాలను ఆయన పంచుకున్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చిన తొలినాళ్లలో, చిరంజీవి గారి ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారట. పలువురు సినీ దర్శకులు, నిర్మాతలు హాజరైన ఆ సందర్భంలో చిరంజీవి గారు మాట్లాడుతూ.. ఎవరైనా మంచి జోకులు చెప్పండి అని అన్నారట. మొదట ఎవరూ ముందుకు రాకపోవడంతో, చిరంజీవి గారు ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని సుబ్రహ్మణ్యం గారూ, మీరు చెప్పండి, మీరు చెబితే బావుంటుంది అని అన్నారట.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు, సినీ పెద్దలు అందరూ అక్కడ ఉన్నారు. మొదట్లో నేను ఆలోచించినా చిరంజీవి గారు చెప్పమనడంతో రెండు జోకులను చెప్పాను. దాని ద్వారా నాకు చాలా అవకాశాలు వచ్చాయి అని అన్నారు. అలాగే పౌరాణిక నాటకాల పట్ల తనకున్న మక్కువ అని అన్నారు. తన స్వగ్రామమైన కొమ్మినేనివారిపాలెం నుండి 50-60 కిలోమీటర్లు లారీలలో ప్రయాణించి, తెనాలి, పొన్నూరు, ఒంగోలు, ఏడుగుళ్లపాడు వంటి ప్రాంతాలకు వెళ్లి రంగస్థల నటుల నాటకాలను చూసేవాళ్ళం. ఘంటసాల, మాధవపెద్ది సత్యం వంటి వారి సినిమాటిక్ పద్యాలు తనపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని తెలిపారు.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
అయితే, కాలక్రమేణా ప్రజానాట్యమండలి ప్రభావంలోకి వచ్చి, జాషువా, శ్రీశ్రీ వంటి సమాజం కోసం రాసిన కవుల పద్యాల పట్ల ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. “ఏదీ తల్లి నీడు కూర్చిన హిమ సమూహములు” వంటి శ్రీశ్రీ పద్యాలు తనలో పులకరింతలు రేకెత్తేవని, కాకతీయుల కథన కాహళ ధ్వనులు, ఝాన్సీరాణి వంటి చారిత్రక అంశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ధర్మవరపు సుబ్రహ్మణ్యం వివరించారు. ఈ సంభాషణ ద్వారా ఆయన బహుముఖ ప్రజ్ఞ, కళల పట్ల అంకితభావం స్పష్టమయ్యాయి.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




