Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా వాయిదా.. ఆ హీరోయిన్ ను దారుణంగా ట్రోల్ చేస్తోన్న విజయ్ ఫ్యాన్స్.. వీడియో
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి దళపతి విజయ్ నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా థియటర్లలో సందడి చేస్తుండేది. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌కు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో తీర్పు కూడా శుక్రవారం (జనవరి 9) వెలువడనుంది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఇది వరకే అధికారికంగా ప్రకటించింది.

మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ప్రేములు’ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార. ఆ తర్వాత డ్యూడ్ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరిందీ అందాల తార. మమిత తన గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అభినయం పరంగానూ ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఆమెకు విజయ్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ‘జన నాయగన్’ సినిమాలో విజయ్ కూతురి పాత్రలో నటించిందీ మలయాళ ముద్దుగుమ్మ. అయితే గత కొన్ని రోజులుగా విజయ్ ఫ్యాన్స్ మమితను ట్రోల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జన నాయగన్ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ మలేషియలో అట్టహాసంగా జరిగింది. హీరో విజయ్ హీరోయిన్లు పూజా హెగ్డే, మమితతో పాటు చిత్ర బృందమంతా ఈ ఈవెంట్ కు హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో మమిత విజయ్ ని పొగుడుతూ ఒక పాట పాడింది. అయితే అది ట్రోలర్స్ కు స్టఫ్ గా మారిపోయింది.
దళపతి విజయ్ నటించిన ‘అళగియ తమిళ మగన్’ సినిమా 2007లో విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ సరసన శ్రియ శరణ్, నమిత తదితరులు నటించారు. ఈ సినిమాలోని ‘ఎల్ల పుగలుమ్’ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. అయితే జననాయగన్ ఈవెంట్ లో మమిత ఈ పాటను ఇష్టమొచ్చినట్లు పాడింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అయితే అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి జన నాయగన్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉండేది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా అనూహ్యంగా ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
మమితను ట్రోల్ చేస్తున్నది ఇందుకే.. వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




