Recharge Offer: కేవలం ఒక్క రూ.1 రీఛార్జ్‌తో నెల రోజులు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. పండుగ వేళ ఇండస్ట్రీని షేక్ చేసే ఆఫర్..
సంక్రాంతి పండుగ వేళ బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.1కే నెల రోజుల పాటు ఉచితంగా కాల్స్, ఇంటర్నెట్ వాడుకునే ఆఫర్ ప్రవేశపెట్టింది. దీంతో ఈ ఆఫర్ పొందేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ ఆఫర్ వివరాలు ఏంటి? అనేది చూద్దాం

BSNL Recharge Offer: ప్రముఖ టెలికాం రంగం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్రీడమ్ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద రూ.1కే కొత్త సిమ్ కార్డ్ అందించనుంది. రూపాయికే సిమ్ కార్డు మాత్రమే కాకుండా నెల రోజుల పాటు ఉచితంగా ఆన్‌లిమిటెడ్ కాల్స్ అందించనుంది. అలాగే 30 రోజుల పాటు రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభించనున్నాయి. అంటే కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు మీరు ఫ్రీగా కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చు. జనవరి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులోకి ఉండనుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్ అకౌంట్‌లో స్పష్టం చేసింది. ఈ ఆఫర్ వివరాలు చూస్తే..
రూ.1కే అన్నీ
“వేడుక ముగిసింది. కానీ ఇంకా ఆనందం అయిపోలేదు. కేవలం రూ.1కే ఉచితంగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ పొందండి. ఆన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందండి. 30 రోజుల పాటు ఫ్రీగా ఉపయోగించుకోండి. జనవరి 31 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సమీపంలోని బీఎస్‌ఎన్ఎల్ సీఎస్సీ లేదా రిటైలర్‌ను సంప్రదించి సిమ్ తీసుకోండి అంటూ”ఎక్స్‌లో పేర్కొంది. కొత్తగా సిమ్ తీసుకునే కస్టమర్లతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పోర్టబులిటీ అయ్యేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు అయి ఉంటే ఆఫర్ వర్తించదు.
పండుగ ఆఫర్లు
సంక్రాంతి, రిపబ్లిక్ డే వస్తున్న క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ తీసుకొచ్చింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏడాది రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తెస్తూ ఉంటుంది. అందులో భాగంగా మళ్లీ ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రైవేట్ టెలికాం రంగం సంస్థలైన ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియాకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ నిలుస్తోంది. ఆ కంపెనీల రీఛార్జ్ ధరలు అధికంగా ఉన్నాయి. త్వరలోనే రీఛార్జ్ ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. అయితే వాటితో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ధరలు తక్కువగా ఉన్నాయి. త్వరలో 5జీ నెట్‌వర్క్‌ను కూడా అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ రెడీ అవుతోంది. దీంతో చాలామంది మళ్లీ బీఎస్‌ఎన్‌ఎల్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు క్రమక్రమంగా కస్టమర్లు పెరుగుతున్నారు.
