11 January 2026

స్పీడ్ పెంచిన బ్యూటీ.. వరుస సినిమాలను లైనప్ చేసిన సంయుక్త 

Rajeev 

Pic credit - Instagram

సంయుక్త మీనన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది ఈ అందాల భామ పేరు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్.

ఇందులో సెకండ్ హీరోయిన్‍గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది. దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా మారింది.

ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.

ఇటీవలే బాలయ్యతో కలిసి అఖండస్ 2 సినిమాతో హిట్ అందుకుంది సంయుక్త మీనన్. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. 

శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి సినిమాలో నటిస్తుంది ఈ సినిమాలో త్వరలో రాబోతుంది.