రాగి నగలు ధరించడం మన దేశంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. జ్యోతిష్యపరంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా రాగి ఆభరణాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గించడం, చర్మాన్ని కోమలంగా ఉంచడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, కీళ్ల నొప్పులను తగ్గించడం వంటివి వీటిలో కొన్ని ముఖ్యమైన లాభాలు.