Odisha Chartered Plane Crash: ఒడిశాలో ఒక చిన్నసైజు చార్టర్డ్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది, నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శనివారం మధ్యాహ్నం రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.