11 January 2026

తెలుగులో మాయమైపోయింది రకుల్.. దర్శకనిర్మాతలు పట్టించుకోవడంలేదా..?

Rajeev 

Pic credit - Instagram

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో ఈ అమ్మడి పేరు వినిపించి చాలా కాలం అయ్యింది. ఒక్కప్పుడు రాణించింది. 

అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలను మెల్లగా తగ్గించేసింది. 

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ.. తర్వాత వరుసగా సినిమాలు చేసింది. 

తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది.

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది.

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది ఈ అందాల భామ కానీ ఆ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.