AP High Court: సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందాలు, పేకాట నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందాలను నిలిపివేయాలని, పేకాటను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించింది. అవసరమైతే సెక్షన్ 144 విధించవచ్చని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాలు, పేకాటపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటి నిర్వహణను అడ్డుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందాలు నిర్వహించడానికి వీల్లేదు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, పేకాట ఆడితే జైలుకు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో అవసరమైతే సెక్షన్ 144 విధించడానికి కూడా వెనుకాడవద్దని కోర్టు సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad : చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
Sankranthi 2026 : తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

