Hyderabad : చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
సంక్రాంతి పండుగ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయి వర్ధన్ రెడ్డి చైనా మాంజా తగిలి మెడకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకరమైన చైనా మాంజా వాడొద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా, కొందరు వాటిని పట్టించుకోవడం లేదు.
సంక్రాంతి పండుగ రాకతో పతంగుల సందడి మొదలైంది. అయితే, పతంగుల కోసం వినియోగించే చైనా మాంజా అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో ఈ తరహా ప్రమాదం చోటుచేసుకుంది. టూ వీలర్‌పై ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయి వర్ధన్ రెడ్డి మెడకు చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన గొంతుపై లోతైన గాయం కావడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు సాయి వర్ధన్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sankranthi 2026 : తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
మరణశిక్షే !! ఇరాన్ బెదిరింపు ఆగని నిరసనలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

