East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
సంక్రాంతి భోగి పండగకు తూర్పుగోదావరి జిల్లాలోని రాపాక గ్రామంలో అక్కాచెల్లెళ్లు 2 లక్షల 50 వేల భోగి పిడకలను సిద్ధం చేశారు. గత 11 సంవత్సరాలుగా బంధుమిత్రులతో కలిసి నెల రోజుల ముందు నుంచే ఆవుపేడ సేకరించి ఈ అరుదైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇది భోగి మంటల కోసం ఒక ప్రత్యేక ప్రయత్నం.
సంక్రాంతి పండుగలో భోగి రోజుకు విశేష ప్రాధాన్యత ఉంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఈ భోగి మంటల కోసం ప్రత్యేకంగా ఆవుపేడతో తయారు చేసిన పిడకలను దండలుగా కట్టి ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం రికార్డు సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాపాక గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు భోగి పండగ కోసం ఏకంగా 2 లక్షల 50 వేల భోగి పిడకలను సిద్ధం చేశారు. బంధుమిత్రుల సహాయంతో వీరు ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో పిడకలను తయారు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరణశిక్షే !! ఇరాన్ బెదిరింపు ఆగని నిరసనలు
Neha Shetty: సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న నేహా శెట్టి
మార్చి 19న ధురంధర్ Vs టాక్సిక్
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

