మరణశిక్షే !! ఇరాన్ బెదిరింపు ఆగని నిరసనలు
ఇరాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనితో ఆగ్రహించిన ప్రజలు ప్రభుత్వంపై నిరసనలు చేపడుతున్నారు. మహిళలు బురఖాలు తీసేసి, అయతొల్లా ఖమేనీ ఫోటోలు కాల్చేస్తున్నారు. ప్రభుత్వం ఆందోళనలను అణచివేస్తుండగా, మరణశిక్షల హెచ్చరికలు జారీచేసింది. ఇంటర్నెట్ బంద్‌తో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ఇరాన్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతోంది. ఆ దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావరసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్థానిక మార్కెట్‌లో ట్రే గుడ్లు 35 లక్షలు, లీటరు వంట నూనె ధర 18 లక్షలకు చేరింది. నెలకు సరిపడా సామాను కావాలంటే బస్తాల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొనటంతో పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారుపరిస్థితి చక్కబెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీలకు బదులు నేరుగా చేతికి డబ్బు ఇస్తోంది. అయినా ఆందోళనలు ఆగడం లేదు. పాలకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై నిరసన తెలిపే క్రమంలో మహిళలు, యువతులు తమ బురఖాలు తీసేస్తూ.. ఆధునిక వస్త్రాలు ధరిస్తున్నారు. చాలా మంది యువతులు సిగరెట్లు తాగుతూ, ఇరాన్ అధినేత అయతొల్లా ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇరాన్ లో 1989 కంటే ముందు రాజుగా ఉన్న షా వారసుడు రెజా పహ్లావి పాలన కావాలంటూ అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. పోలీసులు ఎంతగా అణచివేస్తున్నా ఆందోళనలో ఆగడంలేదు. మరోవైపు ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలకు అమెరికా మద్దతు పలికింది. భద్రతా బలగాలు అణచివేత చర్యలు చేపట్టాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటికే చాలా మంది మరణించగా, వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా, వారికి సహాయం చేసే వారిని కూడా ‘మొహారెబ్’ అంటే దేవుడి శత్రువులు గా పరిగణిస్తామని, దీనికి ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే అవకాశం ఉందని ఇరాన్ అటార్నీ జనరల్ మహ్మద్ మొవాహెదీ హెచ్చరించారు. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తూ అణచివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “అమెరికా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. శాంతియుత నిరసనకారులను చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు బహిష్కృత యువరాజు రెజా పహ్లావి కూడా శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలని, ప్రభుత్వ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి సమ్మెలు చేపట్టాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరాన్ ప్రపంచంతో సంబంధాలు లేకుండా డిజిటల్ చీకట్లో ఉంది. గురువారం నుంచే ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ముసుగులో భద్రతా దళాలు భారీగా హింసకు పాల్పడే అవకాశం ఉందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రియన్, టర్కిష్ వంటి విదేశీ విమాన సంస్థలు ఇరాన్‌కు తమ విమాన సర్వీసులను రద్దు చేసాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Neha Shetty: సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న నేహా శెట్టి
మార్చి 19న ధురంధర్ Vs టాక్సిక్
సడన్‌గా తీరిన హీరోయిన్ల కొరత.. కుర్ర హీరోలకు పండగే
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

