AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు

రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు

Phani CH
|

Updated on: Jan 12, 2026 | 4:04 PM

Share

రష్యాలో తీవ్ర కార్మిక కొరత కారణంగా, భారత్ నుండి అనేక మంది ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్తున్నారు. వీరిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముఖేష్ మండల్ వంటి వారు నెలకు 1.1 లక్షల రూపాయల జీతంతో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీధులు శుభ్రం చేస్తున్నారు. వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వీరికి ఆహారం, వసతి వంటి సౌకర్యాలు కల్పిస్తూ, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం వచ్చిన వీరు కొంతకాలం తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు.

రష్యా లో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో రష్యాలో ఉద్యోగాలు చేయడానికి భారత్‌ నుంచి కొంతమంది అక్కడ వాలిపోయారు. ఏం చేశామన్నది కాదు గౌరవంగా ఎలా బతుకున్నామనేదే ముఖ్యం అని చాటి చెబుతున్నారు. వీరిలో రైతులు, చిన్న వ్యాపారులు, ఒక టెకీ కూడా ఉన్నారు. వీరంతా రష్యాలో వీధులు శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. నెలకు జీతం ఎంతో తెలుసా? లక్ష రూపాయలు. 26 ఏళ్ల ముఖేష్ మండల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇండియాలో అతనికి ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వీధులను శుభ్రం చేసే పని కోసం కొన్ని నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల బృందంలో అతనూ ఒకడని రష్యన్ మీడియా తెలిపింది. గత కొన్ని వారాలుగా, ముఖేష్ మండల్, ఇతర భారతీయ కార్మికులు నగరంలో పారిశుధ్య పనులకు బాధ్యత వహించే కొలోమ్యాజ్‌స్కోయ్అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, దుస్తులు వసతి, రవాణాను ఖర్చులు భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు సుమారు 1,00,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం. ముఖేష్ మండల్, ఇతర భారత కార్మికులు కొలోమ్యాజ్‌ అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, , వసతి, రవాణా ఖర్చులను సంస్థ భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు లక్ష రూబుళ్లు అంటే 1.1 లక్షల వేతనం అందిస్తుంది. వీరంతా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారే. కొందరు రైతులు కాగా, మరికొందరు సొంతంగా చిన్న వ్యాపారాలు నడిపారు. ఈ బృందంలో వెడ్డింగ్ ప్లానర్లు, డ్రైవర్లు , ఆర్కిటెక్ట్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. తనకు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని ముఖేష్‌ రష్యా మీడియాతో చెప్పాడు. ముకేష్‌ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారా చేస్తే ఎంతకాలం పనిచేశారు అనే దానిపై క్లారిటీ లేదు. తన ఈ నిర్ణయం ఆర్థిక అవసరాల వల్లే తీసుకున్నానని ముకేష్‌ తెలిపాడు. తనకు పనే దైవమనీ ఏది చేసినా ఫోకస్‌ పెట్టి గొప్పగా చేయడమే తనకు తెలుసని చెప్పారు. ఏడాది కాలం రష్యాలో ఉండి, కొంత డబ్బు సంపాదించి, ఆపై స్వదేశానికి తిరిగి వెళతానని మీడియాతో అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Weather Update: సంక్రాంతి వేళ వర్ష సూచన ఆ జిల్లాలకు ఐఎండీ అలర్ట్

Andhra Pradesh: పందెం రాయుళ్లకు షాక్ !! కలెక్టర్లు,ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు

Gold Price Today: మండిపోతున్న బంగారం.. రూ.3 లక్షలకు చేరువలో వెండి