Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం 5.14 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను ప్రకటించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ బీమా పథకం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది, తద్వారా వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటింది.
తెలంగాణ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు భరోసా లభిస్తుంది. రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులకు రూ.1 కోటికి పైగా బీమా అందుతోంది. సింగరేణిలో 38 వేల మంది, విద్యుత్ సంస్థల్లో 71 వేల మందికి పైగా ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రమాద బీమాను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాద బీమా అమలు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: సంక్రాంతి వేళ వర్ష సూచన ఆ జిల్లాలకు ఐఎండీ అలర్ట్
Andhra Pradesh: పందెం రాయుళ్లకు షాక్ !! కలెక్టర్లు,ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు
Gold Price Today: మండిపోతున్న బంగారం.. రూ.3 లక్షలకు చేరువలో వెండి
Maruthi: అలా అనకండి డార్లింగ్స్..మరో సారి చూడండి.. నచ్చుతుంది
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

