Gold Price Today: మండిపోతున్న బంగారం.. రూ.3 లక్షలకు చేరువలో వెండి
జనవరి 12న బంగారం, వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ట్రంప్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్‌గా బంగారాన్ని ఎంచుకోవడంతో ధరలు భారీగా పెరిగాయి. 24K 10 గ్రాములు రూ.1,42,150, 22K రూ.1,30,300 చేరాయి. కిలో వెండి రూ.12,000 పెరిగింది. కొనుగోలుకు ముందు ధరలు సరిచూసుకోవడం ముఖ్యం.
బంగారం ధరలు రోజు రోజుకు చుక్కలనంటుతున్నాయి. పెద్ద పండగ పూట బంగారం మాట ఎత్తాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 12 సోమవారం కూడా ధరలు భారీగా పెరిగాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇతర ఆస్తుల నుండి ఉపసంహరించుకుంటున్నారు. సేఫ్ హెవెన్ గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. జనవరి 12, సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,690 లు పెరిగి రూ.1,42,150లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,550లు పెరిగి రూ.1,30,300 లకు చేరింది. వెండి కూడా భారీగానే పెరిగింది. కేజీకి రూ.12,000 పెరిగి రూ.2,87,000లు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,42,300, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,450 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,150 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,30,300 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,130, ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,42,150 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,30,300 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,87,000 పలుకుతోంది. రోజులో ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. కనుక బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Maruthi: అలా అనకండి డార్లింగ్స్..మరో సారి చూడండి.. నచ్చుతుంది
తమిళ పొంగల్‌కు ఏం జరుగుతుంది.. అన్నీ అనుమానాస్పదమే
నెక్స్ట్ రూ. 1000 కోట్లు ఎవరిది..? రేసులో ఉన్నదెవరు..?
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

