బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం..
బ్రిటీషర్ల పాలనలో భారతదేశం 200 ఏళ్ల పాటు నలిగిపోయింది. స్వాతంత్ర పోరాటంతో చివరకు స్వేచ్ఛ లభించింది. అయితే ఈ పోరాటంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఈ కోవలోకే వస్తాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో చపాతీలు కూడా కీలక పాత్ర పోషించాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. భారతీయుల ఆహారంలో భాగమైన రోటీ ఓ ఉద్యమానికి తెరతీసింది. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇంతకీ ఏంటా ఉద్యమం..? అసలు ఉద్యమం ఎందుకు చేశారు..?
రాజుల పాలనలో వర్తక, వాణిజ్యం పేరుతో వలస వచ్చిన బ్రిటిషర్లు క్రమంగా మన దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రజలను బానిసలుగా మార్చేశారు. పరాయి పాలనలో శతాబ్దాల పాటు నలిగిపోయిన జనం ఆ త్రవాత బ్రిటీషర్ల పెత్తనాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎందరో వీరులు బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే 1857లో తొలిసారిగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమమే.. ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమానికి బీజం వేసింది. అయితే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ఏడాదే చపాతీల ఉద్యమం మొదలైంది. ఇదే 1857 తిరుగుబాటుకు బీజం వేసిందని అంటారు. 1857లో తొలినాళ్లలో ప్రారంభంలో మొదలైన చపాతీ ఉద్యమం బ్రిటిషర్లలో అనుమానంతో పాటు భయం కలిగించింది. దీన్ని ఎవరు, ఎందుకు ప్రారంభించారో తెలియకపోయినా.. దేశంలోని ప్రతి గ్రామంలో చపాతీల పంపిణీ ఓ ఉద్యమంలా సాగింది. అటవీ ప్రాంతం నుంచి ఓ గ్రామానికి వచ్చిన వ్యక్తి ఊరి పెద్దకు కొన్ని చపాతీలు ఇచ్చి వాటిని అందరికీ పంచమని చెప్పాడట. మరికొన్ని రోటీలు చేసి పక్క గ్రామాలకు తీసుకెళ్లి ఇవ్వమన్నాడట. ప్రతీ చపాతీని అరచేతి పరిమాణంలో బార్లీ, గోధుమ పిండితో చేయాలని చెప్పాడట. సదరు ఊరి పెద్ద అడవి నుంచి వచ్చిన వ్యక్తి చెప్పినట్లే చేయడంతో కొన్నాళ్లలోనే ఉత్తర భారతదేశమంతటా చపాతీల పంపిణీ ఓ ఉద్యమంగా విస్తరించింది. బ్రిటీషర్ల ఆధీనంలో ఉండే ప్రతి పోలీస్ స్టేషన్ కు కూడా చపాతీలు పంపేవారట.
మరిన్ని వీడియోల కోసం
మైక్రోసాఫ్ట్ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్ బీమ్ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో