ఫ్రీజర్‌లా మారిన అమెరికా.. మంచులో జారుతూ.. జూలో జంతువుల ఆటలు
అమెరికాను తీవ్ర మంచు తుఫాన్ చుట్టుముట్టింది, పలు రాష్ట్రాలు గడ్డకట్టుకుపోతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా మంచు కురిసి, విద్యుత్, విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై ప్రయాణాలు కష్టతరంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టింది. అమెరికన్లు ఎముకలు కొరికే చలిని అనుభవిస్తున్నారు.
అమెరికా ఫ్రీజర్ గా మారింది. చాలా ప్రాంతాలు గడ్డ కట్టుకుపోతున్నాయి. మంచు తుఫాన్ ఎఫెక్ట్ అమెరికాపై అంతకంతకూ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎముకలు కొరికే చలి ఎలా ఉంటుందో అమెరికన్లు అనుభవిస్తున్నారు. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను మంచు తుఫాన్ తాకింది. దీంతో చాలా చోట్ల రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. చలిగాలులు వణికిస్తున్నాయి. దక్షిణ ఐయోవాలో ఏకంగా 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. తుఫాన్ ప్రభావంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచు తుఫాన్ కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. హైవేలన్నీ మంచుతో నిండిపోవడంతో ఆ మంచును తొలగించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. రోడ్ల మీద నిలిపి ఉన్న కార్లు మంచులో కూరుకుపోయాయి. మంచు కారణంగా రోడ్ల మీద ప్రయాణాలు కష్టతరంగా మారాయి. ఈ మంచు కారణంగా కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కమ్మేయడంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. టెక్సాస్, లూసియానా, అలబామా, దక్షిణ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. ఓవైపు జనాలు ఈ మంచు తుఫాన్‌తో ఇబ్బంది పడుతుంటే.. జంతువులు మాత్రం మంచును ఆస్వాదింస్తూ కనిపించాయి. ఓ జూలో జంతువులు మంచు మంచును ఆస్వాదిస్తూ ఆటలాడాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ విషయంలో నయన్‌ని ఫాలో కీర్తి సురేష్.. అదే ఆమె చేసిన తప్పా ??
నా కోసం కథలు రాయకండి.. కథల కోసమే నేను ఉంది
విజయ్‌కి సలహా ఇవ్వనంటున్న కమల్ హాసన్.. కారణం
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

