AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల

సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల

Phani CH
|

Updated on: Dec 02, 2025 | 7:28 PM

Share

భారత ర్యాలీ డ్రైవర్ నవీన్ పులిగిల్ల, కో-డ్రైవర్ మూసా షెరీఫ్ WRC3 సౌదీ ర్యాలీలో చరిత్రాత్మక రెండవ స్థానాన్ని సాధించారు. ఈ అద్భుత విజయం అంతర్జాతీయ వేదికపై భారత మోటార్‌స్పోర్ట్స్‌కు గొప్ప గౌరవాన్ని తెచ్చింది. ఫోర్డ్ ఫియెస్టా కారుతో ఎడారి ట్రాక్‌లలో సత్తా చాటిన ఈ జంట, యువ డ్రైవర్లకు స్ఫూర్తినిచ్చింది. చిన్ననాటి నుంచే ఆటోమొబైల్స్‌పై మక్కువతో నవీన్ ఎన్నో విజయాలు సాధించారు.

సౌదీ అరేబియాలో జరిగిన వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ రౌండ్‌లో భారత ర్యాలీ డ్రైవర్ నవీన్ పులిగిల్ల–వెటరన్ కో డ్రైవర్ మూసా షెరీఫ్ జంట చరిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ జంట WRC3 కేటగిరీలో రెండో స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత మోటార్‌స్పోర్ట్స్‌కు ప్రత్యేక గౌరవాన్ని సాధించారు. ఫోర్డ్ ఫియెస్టా ర్యాలీ3 కారుతో పోటీ పడిన ఈ ద్వయం.. అద్భుతమైన కొలాబరేషన్‌తో సౌదీ ఎడారి ట్రాక్‌ల మీద కారును ఉరకలెత్తించారు. కెన్యాలో ఈ ఏడాది మార్చి చివరలో జరిగిన ర్యాలీలో డెబ్యూ చేసిన ఈ జంట… సౌదీలో అద్భుత ఫలితాన్ని సాధించటంతో దేశవ్యాప్తంగా వీరిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ విజయంతో అంతర్జాతీయ ర్యాలీయింగ్‌లో భారత్ సత్తాచాటినట్లయింది. అనేక మంది భారతీయ యువ ర్యాలీ డ్రైవర్లకు తాజా విజయం ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. బైకు యాక్సిలరేటర్‌ రైజ్ చేసినప్పుడు వచ్చే సౌండ్ అంటే ఇష్టంతో హైదరాబాద్‌కు చెందిన నవీన్ పులిగిల్ల మెకానిక్‌ అవతారం ఎత్తాడు. ఆ రంగంలో పట్టు సాధించాడు. ఆటోమొబైల్‌పై మక్కువతో విదేశాల్లో చదువూ వదులుకున్నాడు. చాలామంది కష్టం అనుకునే.. సఫారీ ర్యాలీలో సత్తాచాటి ఛాంపియన్‌ రేసర్‌ అయ్యాడు. తొలిరోజుల్లో నవీన్ ఆఫ్‌రోడ్‌ ఈవెంట్లపై దృష్టి పెట్టాడు. తొలి పోటీ నుంచే ఎన్నో ఆఫ్‌రోడ్‌ పోటీల్లో విజయం సాధించాడు. హంపీలో ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. 2023లో ర్యాలీ ఆఫ్‌ హైదరాబాద్‌లో మంచి ప్రతిభ చూపి, ఐఎన్‌ఆర్‌సీ ‘రైజింగ్‌ స్టార్‌’ అయ్యాడు. 2024లో జరిగిన ర్యాలీలో రెండో స్థానంలో, ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ-1లో మూడో స్థానంలో నిలిచాడు. ఏషియా పసిఫిక్‌ ర్యాలీకి అర్హత సాధించి, న్యూజిలాండ్‌లో ఫైనల్స్‌ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత వరల్డ్‌ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూఆర్‌సీ)కి కూడా ఎంపికయ్యాడు. ఈ ఏడాది మార్చిలో నవీన్‌ బృందం కెన్యా నేషనల్‌ ర్యాలీలో WRC-3 విభాగంలో అగ్రస్థానంలో నిలిచి శభాష్‌ అనిపించుకోగా, తాజాగా సౌదీలో జరిగిన వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ పోటీలో రెండవ స్థానంలో నిలిచి.. వావ్ అనిపించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు

తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..

కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి

ఊరెళ్లేటప్పుడు ఇల్లే.. ఇంటికి వచ్చేసరికి కోళ్ల ఫారం అయ్యింది.. అదే కదా మ్యాజిక్కు..

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. దీనితో మీ సామాన్లు భద్రం