Punjab Assembly Election 2022: భగవంత్ మాన్.. మా పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి.. కీలక ప్రకటన చేసిన ఆప్ అధినేత..
పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మొహాలీలో జరిగిన విలేకరుల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మొహాలీలో జరిగిన విలేకరుల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ప్రజల ఓటింగ్ ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంచుకుందని తెలిపారు. భగవంత్ మాన్ పేరును మొత్తం 21 లక్షల మంది ఫోన్, వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారని . ఈ టెలివోట్‌లో, భగవంత్ మాన్ పేరును గరిష్ట సంఖ్యలో ప్రజలు అంగీకరించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే మొదటి ఎంపిక.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, మొత్తం 21 లక్షల 59 వేల 437 మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. వీరిలో కొందరు అరవింద్ కేజ్రీవాల్ పేరు మీద కూడా తమ ఓటు వేశారు. అయితే ఆ ఓట్లు చెల్లనివిగా మారిపోయాయి. మిగిలిన 93 శాతం మంది భగవంత్ మాన్ పేరును ఎంచుకున్నారు. అదే సమయంలో, 3.6 శాతం మంది ప్రజలు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరును కూడా ఎంచుకున్నారు.
ఎవరైనా తమ ఎంపికను నమోదు చేసుకోవలసి వస్తే, వారు కాల్‌లో బీప్ వచ్చిన తర్వాత, SMS ద్వారా లేదా వాట్సాప్‌లో సందేశం ద్వారా పేరును వదిలివేయాలిని పేర్కొంది. ఈ విధంగా అందిన డేటా ద్వారా సీఎం అభ్యర్థిని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
2017లో ఏం జరిగిందంటే..
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. 20 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈసారి, ఎన్నికలకు ముందే పార్టీ తన ముఖ్యమంత్రి ముఖాన్ని ప్రకటిస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ తొలి రోజుల నుండి ఓటర్లకు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..