చెట్టు మీది నుంచి దూకిన అభిమాని.. షాకైన విజయ్ దళపతి
కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. నటుడిగా ఆయనకు భారీ అభిమానులు ఉండటం వల్ల విజయ్ ఎక్కడికి వెళ్ళినా జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొందరైతే తమ అభిమాన హీరోలను కలవాలన్న కోరికతో ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుననారు.
దీనికి తాజా ఉదాహరణ ఈ సంఘటన. విజయ్ ని చూసేందుకు ఒక అభిమాని ఏకంగా చెట్టు మీద నుంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దళపతి విజయ్ ఏప్రిల్ 26న కోయంబత్తూరులో తన పార్టీ తరపున ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన వ్యాన్ పైన నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా.. ఓ అభిమాని ఉన్నట్టుండి చెట్టు మీద నుంచి విజయ్ ఉన్న వ్యాన్ పైకి దూకాడు. సదరు అభిమాని ప్రవర్తనకు మొడట షాకైన విజయ్.. ఆ తర్వాత ఆ అభిమానికి పార్టీ కండువా కప్పి, అక్కడి నుంచి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ అభిమాని చేసిన ఈ చర్యను కొందరు నెటిజన్లు విమర్శించారు. ‘ఇదేం పిచ్చితనం.. ఈ అభిమానులకు ఏమైనా తెలివి ఉందా? ఇలాంటి మూర్ఖత్వాన్ని అసలు సహించకూడదు’ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
పెళ్లి కార్డుపై మహేష్ బాబు !! అట్లుంటది ఘట్టమనేని ఫ్యాన్స్ అంటే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

